Prakash Raj: ఇది మనకు తెలిసిన కథే.. రంగమార్తాండ ట్రైలర్ రివ్యూ..
మన కథల్ని, మన మట్టి కథల్ని అందంగా చూపించడంలో కృష్ణవంశీ తర్వాతే ఎవరైనా! అలాంటి కృష్ణవంశీ చాలా గ్యాప్ తీసుకొని రంగమార్తాండను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు.
రంగస్థలమే రాఘవరావు.. రాఘవరావు అంటేనే రంగస్థలం అంటూ మొదలయ్యే ట్రైలర్.. టోటల్‌గా ఎమోషనల్‌గా కనిపించింది. అన్ని పాత్రలు సక్సెస్‌ఫుల్‌గా చేశాను రెండు పాత్రలు తప్ప అని ప్రకాశ్‌రాజ్‌తో చెప్పించిన డైలాగ్.. స్టోరీ ఏంటో చెప్పకనే చెప్తోంది. భర్తగా, కొడుకుగా విఫలం అయిన ఓ రంగస్థల కళాకారుడి జీవితమే రంగమార్తాండ ! ఫ్యామిలీ ఎమోషన్ పండించడంతో కృష్ణవంశీ దిట్ట. అలాంటి క్రియేటివ్ డైరెక్టర్‌కు ఇప్పుడు అద్భుతమైన స్టోరీ దొరికింది.
కన్నీళ్లతో ఖర్చీఫ్ తడిచిపోవడం ఖాయం అనిపిస్తోంది. ఎప్పుడూ బ్రహ్మానందాన్ని కృష్ణవంసీ ఈ సినిమాలో పరిచయం చేస్తున్నాడు. మద్యానికి బానిసైన ఓ వ్యక్తిగా.. జీవితంలో ఏదీ సాధించలేకపోయిన సగటు మనిషిగా రంగమార్తాండలో బ్రహ్మానందం కనిపించబోతున్నాడు. కన్నీళ్లు కారుతున్న ఎర్రని కళ్లు.. రౌద్రంగా కనిపించిన మొహం.. బ్రహ్మానందం పాత్ర మీద మరింత క్యూరియాసిటీ పెంచింది. రంగమార్తాండ సినిమాకు ఇప్పటికే ప్రీమియర్ వేశారు. ప్రతీ ఒక్కరి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఉగాది రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో మరి.