ప్రసాద్ బెహరాకు పెళ్లి, విడాకులు, అతని లైఫ్ సీక్రెట్ ఇదే
ప్రసాద్ బెహరా... సోషల్ మీడియాను, యూట్యూబ్ ను ఫాలో అయ్యే వాళ్లకు అసలు పరిచయం అక్కలేని పేరు. వెబ్ సిరీస్ లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటాడు.
ప్రసాద్ బెహరా… సోషల్ మీడియాను, యూట్యూబ్ ను ఫాలో అయ్యే వాళ్లకు అసలు పరిచయం అక్కలేని పేరు. వెబ్ సిరీస్ లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటాడు. వెబ్ సిరీస్ లు యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఇతని పేరు ఈ మధ్యకాలంలో బాగా మార్మోగిపోతుంది. ఇక కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాతో సినిమాల్లో కూడా అడుగుపెట్టి మంచి సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడే స్టార్ హీరోల సినిమాల్లో కూడా కమెడియన్ గా ఆఫర్లు కొట్టేస్తున్నాడు. ఈ తరుణంలో ప్రసాద్ బెహరా ఓ రేప్ కేసులో అరెస్టు అయ్యాడు.
తన సహనటితో అసభ్యంగా ప్రవర్తించాడు అనే కారణంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 14 రోజులు రిమాండ్ కు కూడా తరలించారు. అయితే అందులో ఎంతవరకు వాస్తవాలు ఉందనేది తెలియకపోయినా ప్రసాద్ బెహరా ప్రస్తుతం బెయిల్ తీసుకుని బయటికి వచ్చే పనిలో ఉన్నాడు. దీనితో అతని కెరీర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడటం ఖాయం అనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. షూటింగ్ లో తనను అసభ్యకరంగా తాకుతున్నాడు అని ఒక హీరోయిన్ అతనిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే ప్రసాద్ బెహరాకు గతంలోనే వివాహం కూడా జరిగిందంట. ఈ విషయాన్ని స్వయంగా అతనే ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. తొందరపడి పెళ్లి చేసుకున్నానని చెప్పిన ప్రసాద్… మేము విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని ప్రసాద్ అప్పట్లో బయటపెట్టాడు. ఆ అమ్మాయి తనకు కరెక్ట్ కాదని అలాగే తాను కూడా ఆ అమ్మాయికి కరెక్ట్ కాదని ఈ విషయాన్ని అమ్మాయే ముందు రియలైజ్ అయిందని… కానీ నెమ్మదిగా తనక్కూడా విషయం అర్థమైందని చెప్పుకొచ్చాడు. తనకు లవ్ ఉండటంతో కొద్దిగా లేటుగా రియలైజ్ అయినట్టు బయటపెట్టాడు.
కానీ ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్ గా ఉంటుందని మేము విడిపోయి రెండేళ్లు అవుతుంది అని ప్రసాద్ చెప్పుకొచ్చాడు. విడాకులు మాత్రం రీసెంట్ గా తీసుకున్నామని ప్రకటించాడు. పెయిన్ ఎలా ఉంటుందో తెలిస్తేనే సక్సెస్ చూడగలమని అన్నాడు. తాను బాధను తట్టుకోవడానికి కాళీ లేకుండా పనిచేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఎవరు చనిపోయినా, ఎవరు పెళ్లి చేసుకుంటున్న, వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రసాద్ బెహరాను బయటకు తీసుకురావడానికి ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే రేప్ కేసులో వాస్తవాలు ఎలా ఉన్నాయి అనేదానిపై క్లారిటీ లేకపోయినా ఈ కేసు విషయంలో మాత్రం పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఆధారాలు సేకరించలేదని సమాచారం.