దేవరతో 3000 కోట్ల సినిమా… మతిపోగొట్టేలా సలార్ డైరెక్టర్ ప్లాన్..
దేవర మరో ఆచార్య అనగానే, ఇది ప్లాపని యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కాని ఆచార్య కి మంచి వర్షనే దేవర అనే కోణం ఉండేసరికి వసూల్ల వరద పెరిగింది. అచ్చంగా ఇప్పుడు ఎన్టీఆర్ తో కేజీయఫ్ కి మరో వర్షన్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్.
దేవర మరో ఆచార్య అనగానే, ఇది ప్లాపని యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కాని ఆచార్య కి మంచి వర్షనే దేవర అనే కోణం ఉండేసరికి వసూల్ల వరద పెరిగింది. అచ్చంగా ఇప్పుడు ఎన్టీఆర్ తో కేజీయఫ్ కి మరో వర్షన్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ ని మించే రేంజ్ లో ఈ మ్యాన్ ఆఫ్ మాసెస్ ని మనముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన మూవీ బ్యాక్ డ్రాప్ వినగానే, వెయ్యికోట్లు కాదు, అలాంటివి మూడు కలిపేసుకోవాలనే మాట వినిపిస్తోంది. ఇంతకి త్రిబుల్ ఆర్ లో భీముడిగా, దేవరలో దేవర అండ్ వరగా వాయించిన ఎన్టిఆర్ ని ఇంకేస్థాయిలో చూపించబోతున్నాడు… ఇంతకి ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 3000 కోట్ల స్ట్రాటజీ ఏంటి? చూసేయండి.
3 వేల కోట్ల వసూళ్ల సినిమా ఇండియా చరిత్రలోనే రాలేదు. అదే ఎన్టీఆర్ విషయంలో జరగబోతోందా? ఓ సినిమా హిట్టయ్యాక వచ్చే వసూళ్లతో వెయ్యికోట్లొస్తాయి… 1500 కోట్లొస్తాయని చెప్పొచ్చు.. కాని ఓ మూవీ విడుదలవ్వకముందే కాదు, అసలు షూటింగ్ మొదలవ్వకముందే 3 వేల కోట్లొస్తాయని చెబితే అది కేవలం భ్రమ అవుతుంది..
కాని అది బ్రమ కాదు దానికో లెక్కుందు… ఆలెక్క వెనక మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే లక్కుంది… ఇది ప్రశాంత్ నీల్ టీం నుంచి వస్తున్నరెస్పాన్… దేవర తర్వాత వార్ 2 షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్..
ఆతర్వాతే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా మొదలౌతుంది. అదే 3 వేల కోట్ల సినిమా అంటున్నారు. నిజానికి ఇండియా లోనే వసూల్ల పరంగా నెం. 1 ప్లేస్ లో ఉన్న దంగల్ మూవీ కలెక్సన్స్ 2 వేల కోట్లు. ఇక సెకండ్ ప్లేస్ లో 1850 కోట్లతో బాహుబలి సెకండ్ పార్ట్ ఉంది. ఆతర్వాత 1200 కోట్లతో కేజీయఫ్ 2. త్రిబుల్ ఆర్ ఉంటే, 900 కోట్లతో సలార్, 750 కోట్లతో యానిమల్ ఉన్నాయి…
సో ఇంతవరకు బాహుబలి2 తాలూకు 1850 కోట్ల వసూళ్లని, దంగల్ తాలూకు 2 వేల కోట్ల రికార్డుని మరే మూవీ రీచ్ కాలేదు. బాహుబలి 2 తీసిన రాజమౌళినే త్రిబుల్ ఆర్ తో తన రికార్డుని తానే రీచ్ కాలేదు. అలాంటప్పుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తీయబోయే సినిమా 3 వేల కోట్లు సినిమాఅవుతుందనటానికి లెక్కలేంటి? ఈ డౌటే ఎవరికైనా వస్తుంది..
కాని కంటెంట్, మార్కెటింగ్ ఈ రెండు సింకైతే, లక్ ని కూడా ట్రాక్ లోకి తీసుకురావొచ్చు… అలాంటి ప్రయత్నమే ప్రశాంత్ నీల్ మేకింగ్ లోఎన్టీఆర్ గట్టిగా చేస్తున్నాడు. ఇక తారక్ తో ప్రశాంత్ నీల్ లాంచ్ చేసిన మూవీ కంటెంట్ బ్యాక్ డ్రాప్ మతిపోగొట్టేలా ఉంది. బాంగ్లా దేశ్ లో సెటిలైన ఓ తెలుగు ఫ్యామిలీ, మయన్మార్, వియత్నం మాఫియాతో పోరాటే స్టోరీలైన్ తో తెరకెక్కబోతోంది.
స్పిరిట్ మూవీలో రెబల్ స్టార్ కి ఆపోజిట్ గా కొరియన్ విలన్ ని రంగంలోకి దింపాలని సందీప్ రెడ్డి వంగ ప్రయత్నిస్తుంటే, ఆల్రెడీ కొరియన్ విలనే కాదు, జపనీస్ హీరోయిన్ ని కూడా తీసుకోవాలనే ప్లానింగ్ లోఉన్నాడు ప్రశాంత్ నీల్.
అంటే బంగ్లాదేశ్, మయన్మార్, వియత్నం, థాయ్ లాండ్, సింగపూర్, జపాన్, ఇండోనేషియా, మలేషియాలో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేసేలా అక్కడి మార్కెటింగ్ టీమ్స్ తో కూడా టచ్ లోకి వెళ్ళిందట ఫిల్మ్ టీం.. కేవలం అక్కడి నటులు, అక్కడి మార్కెటింగ్ ఏజెన్సీస్ వల్ల వెయ్యికోట్ల సినిమా 3 వేల కోట్లవుతుందా అంటే, ఏమాత్రం వర్కవుట్ అయినా, యూఎస్,యూరప్ వసూల్లలానే సౌత్ ఈస్ట్ ఏసియా దేశాల వసూళ్లు వండర్స్ చేసే ఛాన్స్ఉంది
150 కోట్ల మార్కెట్ ఉన్న తెలుగు సినిమాకు, 250 కోట్లు పెట్టి బాహుబలి తీస్తే అంతా రాజమౌళిని తిట్టారు. కాని బాలీవుడ్ లో 500 కోట్లు రాబట్టడంతో, ఇలా మార్కెట్ పెంచొచ్చని ప్రూవ్ అయ్యింది. అలా పాన్ ఇండియా లెవల్లో ఓతెలుగు సినిమా 1850 కోట్లు కలెక్ట్ చేస్తే, ఆ దారిలో, సలార్, కల్కీ, త్రిబుల్ ఆర్, వెళ్లాయి… అదే బాటలో అచ్చంగా రాజమౌళిలా డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్… బేసిగ్గా పాన్ ఇండియా సినిమా ఏది ప్లాన్ చేసినా, ఏరియార రైట్స్, డిజిటల్ రౌట్స్, ఆఢియోరైట్స్ వీటితోనే రిలీజ్ కిముందే 700 కోట్ల నుంచి 900 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ప్లానింట్ లోనే 2300 కోట్ల వరకు రిలీజ్ కిముందే బిజినెస్ అయ్యేలా తారక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి, అది ఏమాత్రం హిట్ అయినా 3 వేల కోట్ల వసూళ్లు పెద్ద విషయమే కాదు.. ఈ విషయంలో రాజమౌలి కూడా పాన్ ఏసియా మార్కెటింగ్ విషయంలో సలహాలిచ్చాడట.