డ్రాగన్ లీక్స్ పై ప్రశాంత్ అలెర్ట్.. రాజమౌళి రేంజ్ ప్లానింగ్ లో “నీల్”

దాదాపు 10 ఏళ్ల నుంచి సినిమాలను లీకుల వ్యవహారం భయపెడుతున్న విషయం అందరికీ క్లారిటీ ఉంది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే, కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 6, 2025 | 04:43 PMLast Updated on: Feb 06, 2025 | 4:43 PM

Prashant Alert On Dragon Leaks Neil In Rajamouli Range Planning

దాదాపు 10 ఏళ్ల నుంచి సినిమాలను లీకుల వ్యవహారం భయపెడుతున్న విషయం అందరికీ క్లారిటీ ఉంది. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే, కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో కొంతమంది ఫుల్ సినిమా పెట్టేస్తూ శాడిస్ట్ ఆనందాన్ని పొందుతున్నారు. దీనితో ఇప్పుడు సినిమాలు చేసే డైరెక్టర్లు, హీరోలు అందరూ కూడా తమ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.

ఇటీవల రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా విషయంలో డైరెక్టర్ రాజమౌళి చాలా సీరియస్ గా డిస్క్లోజ్ అగ్రిమెంట్ చేయించాడు. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు… చిత్ర బృందం అనుమతి లేకుండా చేస్తే ఖచ్చితంగా భారీగా ఫైన్ వేధిస్తామని రాజమౌళి స్పష్టం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సినిమా నుంచి ఏ ప్రకటన వచ్చినా సరే దర్శకుడు లేదా నిర్మాత నుంచి మాత్రమే రావాలని, ఇతర బృందం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి అనుమతి తప్పనిసరి అని, రాజమౌళి అగ్రిమెంట్లో స్పష్టంగా రాయించినట్లు తెలుస్తోంది.

ఇక షూటింగ్ స్పాట్ కు ఫోన్ లో లేదంటే కెమెరాలు తీసుకెళ్తే మాత్రం, కచ్చితంగా కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది. ఎవరైనా సరే షూటింగ్ స్పాట్ కు రావాలి అనుకుంటే ముందుగా చెప్పిన ప్లేస్ లో ఫోన్ ను కెమెరాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా విషయంలో కూడా వాడుతున్నట్లు సమాచారం. రీసెంట్ గా.. ఈ సినిమా షూటింగు సంబంధించి ఒక ప్రకటన వచ్చింది. త్వరలోనే సినిమాను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఒక మాస్ సాంగ్ తో ఈ సినిమాను అనౌన్స్ చేయడానికి, డైరెక్టర్ ప్రశాంత్ రెడీ అయిపోయాడు. ఈ టైం లో సినిమా షూటింగ్ స్పాట్ కు ఫోన్ గాని కెమెరా గాని తీసుకురావద్దని, అలాగే సినిమా గురించి ఏ అప్డేట్ కూడా సినిమా కోసం పని చేసే వాళ్ళు ఇవ్వడానికి వీలు లేదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీనిపై వాళ్లు కూడా దాదాపుగా అంగీకారం తెలిపారట. రీసెంట్ గా ఈ అగ్రిమెంట్ ను కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంలో మిగిలిన సినిమాలు కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి సినీ వర్గాలు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఏమాత్రం లీకులు వచ్చినా సరే సినిమాకు ఉన్న క్రేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు నిర్మాతలు. అటు బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా విషయంలో కూడా ఇదే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ అయింది.