Prabhas: అవన్నీ అబద్దాలే.. సలార్ టీజర్ మాత్రమే నిజం..
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఇప్పుడే కాదు, ఎప్పుడూ రూమర్లు, గుసగుసలు కంగారు పెట్టిస్తూనే ఉన్నాయి. ఆదిపురుష్ టాక్ వీకై, వసూళ్లు కూడా డల్ అయిన టైంలో సలార్ మీద, ప్రాజెక్ట్ కే మీద వాయిదాల ప్రచారం పెరిగింది. కాని అవేవీ నిజాలు కాదని తెలుస్తోంది.

Prashant Neel, director of the film, said that the teaser of Prabhas Salar's movie is ready to be released
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి జులై 7న సలార్ టీజర్ తో పండగ స్టార్ట్ అన్న మాట నిజిమయ్యేలా ఉంది. ఆల్రెడీ ఎప్పుడో సలార్ టీజర్ ని ఫిల్మ్ టీం కట్ చేసి రెడీ చేసింది. కాని ఆదిపురుష్ రిలీజై నెలగడిచేవరకు ఈ టీజర్ విడుదల చేయొద్దన్న ప్రభాస్ నిర్ణయం వల్లే, జులై ఫస్ట్ వీక్ వరకు ప్రశాంత్ నీల్ టీం ఆగాల్సిన పరిస్తితి వచ్చింది.
ఐతే వచ్చేనెల మొదటి వారంలో సలార్ టీజరే కాదు, ప్రాజెక్ట్ కే టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్అన్నారు. యూఎస్ లో లాంచ్ చేస్తారంటున్నారు. ఐతే నాగ్ అశ్విన్ టీం కూడా మేకింగ్ తోపాటు గ్లింప్స్ ని రిలీజ్ చేయాలనుకుంటోందట. అలాని విజువల్స్ ని రివీట్ చేయకుండా, మరోలా ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం. బాహుబలి 2 సినిమాలో త్రీడీ యానిమేషన్ లో డిజైన్ చేసిన పాటలాంటిదే ప్రాజెక్ట్ కేలో కూడా యానిమేషన్ లో ఓ మాంటేజ్ ప్లాన్ చేశారట. అదే ప్రాజెక్ట్ కే టైటిల్ పోస్టర్ తో పాటు జులై 8న యూఎస్ లో లాంచ్ చేస్తారని తెలుస్తోంది. వచ్చేనెల మొదటి వారంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి మూడు సర్ ప్రైజులతో పండగ వాతావరణం కన్ఫామ్ అయ్యింది.