నందమూరి వారసుడితో ప్రశాంత్ నీల్ ఫైనల్, బాలయ్య మాస్టర్ మైండ్
కే జి ఎఫ్ సినిమాల తర్వాత తెలుగులో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇమేజ్ భారీగా పెరిగింది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి మన స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
![నందమూరి వారసుడితో ప్రశాంత్ నీల్ ఫైనల్, బాలయ్య మాస్టర్ మైండ్ Prashant Neel Final With Nandamuri Heir Balayya Mastermind](https://s3.ap-south-1.amazonaws.com/media.dialtelugu.com/wp-content/uploads/2025/02/OgMYmjfD-uE-HD.jpg)
కే జి ఎఫ్ సినిమాల తర్వాత తెలుగులో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇమేజ్ భారీగా పెరిగింది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి మన స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రశాంత్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడానికి బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా మంచి ఆప్షన్ అని రెడీ అయిపోయాడు. సలార్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ స్టార్ డైరెక్టర్, ఇప్పుడు ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది.
త్వరలో సినిమా షూట్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అని ప్రశాంత్ చాలా కాన్ఫిడెంట్ గా కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తో పాటుగా తెలుగులో మరో ఇద్దరు ముగ్గురు హీరోల కోసం ప్రశాంత్ కథ రెడీ చేసుకుని పెట్టుకున్నాడు. రామ్ చరణ్ తో ఒక సినిమా అలాగే అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే టైంలో నందమూరి వారసుడితో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వస్తోంది. తన కొడుకు ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండాలని, ఫ్యూచర్ ప్రాజెక్ట్ లు కూడా బాగా హెల్ప్ అవ్వాలని బాలకృష్ణ చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న సినిమా కోసం ఆయన మోక్షజ్ఞను రెడీ చేశారు.
అయితే ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కావడం నందమూరి ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఆగిపోయింది అనే ప్రచారం కూడా జరిగింది. ఇక బాలకృష్ణ ఆదిత్య 369 సీక్వెల్ కూడా మొదలు పెడుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ టైంలో ప్రశాంత్ నీల్ తో బాలకృష్ణ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తో మోక్షజ్ఞ సినిమా చేస్తే కచ్చితంగా అది కన్నడలో కూడా ప్లస్ అవుతుంది అని, సౌత్ ఇండియా మార్కెట్ భారీగా క్రియేట్ అవుతుందని బాలయ్య నమ్ముతున్నారు. అందుకే మోక్షజ్ఞ ను కూడా ఎలాగైనా ప్రశాంత్ నీల్ తో సినిమా చేసే విధంగా ఒప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పుడు లేకపోయినా దాదాపు 2028 టైం కి ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రశాంత్ చేతిలో కేజిఎఫ్ త్రీ, సలార్ సీక్వెల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలు ఉండటంతో మోక్షజ్ఞతో సినిమా 2028 లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.