Salar : ఊచకోతకు సిద్ధమేనా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన సలార్ మూవీ ఎంత గ్రాండ్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే.. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా భారీ హిట్‌ను అందించాడు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన సలార్ మూవీ ఎంత గ్రాండ్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే.. ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా భారీ హిట్‌ను అందించాడు ప్రశాంత్ నీల్.. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ.. దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది రికార్డులు బద్దలు కొట్టింది. దీంతో.. సలార్ పార్ట్-2 ని ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్‌ని ఆనందంలో ముంచెత్తాడు ప్రశాంత్ నీల్.. దీంతో.. సలార్-2 ఎప్పుడు వస్తుందా, ప్రభాస్ నుంచి మరింత యాక్షన్ ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సలార్-1 బ్లాస్టింట్ హిట్‌తో సలార్-2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. క్లైమాక్స్ లో ప్రభాస్ కూడా శౌర్యంగుడే అనే ట్విస్ట్ ఇచ్చి వదిలేయడంతో పార్ట్ 2 పై అంచనాలు స్కైహైని తాకాయి. ఇందులో భాగంగానే ‘సలార్ 2’ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు. ఆల్ రెడీ ఇప్పటికే సలార్ 2 షూటింగ్ మొదలైంది. ఐతే, త్వరలో మొదలు కాబోయే యాక్షన్ షెడ్యూల్ కోసం భారీ స్విమ్మింగ్ పూల్ సెట్ ను వేస్తున్నట్లు ఓ టాక్ వినిస్తోంది. పైగా ఈ స్విమ్మింగ్ పూల్‌లో కృత్రిమ అలలను కూడా ప్లాన్ చేస్తున్నారట.. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సముద్ర నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోందట.. ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ ‘ఏప్రిల్ లో ఈ సినిమా పార్ట్-2ని స్టార్ట్ చేసి.. 2025లో రిలీజ్ చేస్తామన్నారు. పార్ట్-2 సినిమా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ఉండనుందని ఆయన తెలిపారు. సలార్-2 పార్ట్ 1 నుంచి మించి ఉంటుందని ఇప్పటికే పలువురు హింట్లు ఇస్తున్నారు. దీంతో.. సలార్-2లో ప్రభాస్ నుంచి అసలు సిసలైన రెబల్ యాక్టింగ్ చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టేశారు. చూడాలి మరి.. బాక్సాఫీస్ వద్ద సలార్-2 ఊచకోత ఎలా ఉండనుందో..