ప్రశాంత్ నీల్ మొదలుపెట్టాడు.. మరి ఎన్టీఆర్ వచ్చేదెప్పుడు..?

వరుస సినిమాలు చేయడం వేరు. వరుసగా విజయాలు అందుకోవడం వేరు. ఈ రెండు చాలా తక్కువ మంది నటులు చేస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇదే చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2025 | 03:40 PMLast Updated on: Feb 21, 2025 | 3:40 PM

Prashant Neil Started And When Will Ntr Come

వరుస సినిమాలు చేయడం వేరు. వరుసగా విజయాలు అందుకోవడం వేరు. ఈ రెండు చాలా తక్కువ మంది నటులు చేస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇదే చేస్తున్నాడు. తాజాగా ఈయన కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. కేజిఎఫ్, సలార్ లాంటి సెన్సేషనల్ సినిమాలు తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయిన రోజు నుంచి అంచనాలు కూడా ఆకాశంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది.

షురూ చేయడం అంటే అలా ఇలా కాదు ఏకంగా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్ నీల్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. మొదటి షెడ్యూల్ కు జూనియర్ ఎన్టీఆర్ రావడం లేదు. కొన్ని రోజుల తర్వాత సెట్ లో జాయిన్ కానున్నాడు తారక్. ఈలోపు ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు ప్రశాంత్ నీల్.

కన్నడ అమ్మాయి రుక్మిణి వసంత్ హిందీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యే వరకు మరి సినిమా కూడా ఒప్పుకోకూడదు అని ఈ అమ్మాయికి కండిషన్ పెట్టినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ సినిమా వైపు రానున్నాడు తారక్. ఆఫ్రికన్ కంట్రీస్ బార్డర్లో ఉన్న నల్ల సముద్రం సమీపంలో ఈ సినిమా కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. 2026 సంక్రాంతి సినిమా విడుదల కానుంది.