Prashanth Neel: కేజీఎఫ్‌కి చేసిన తప్పే ‘సలార్’కి చేశానన్న ప్రశాంత్ నీల్

KGF విషయంలో ఏ మిస్టేక్ చేశానో సలార్ విషయంలోనూ అదే చేశానన్నాడు ప్రశాంత్ నీల్. ఇంతకీ ఎంటా మిస్టేక్..? సలార్' విడుదలకు ముందు వచ్చిన యాక్షన్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 19, 2023 | 05:23 PMLast Updated on: Dec 19, 2023 | 5:23 PM

Prashanth Neel Comments On Salaar And Kgf Goes Viral On Social Media

Prashanth Neel: ‘సలార్’ థియేటర్లలో సందడి చేసే టైమ్ దగ్గరపడింది. ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో పాటు మలయాళంలో వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు. KGFతో కన్నడ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసిన ప్రశాంత్ నీల్ దర్శకుడు. సౌత్, నార్త్ అనే వ్యత్యాసం లేదు. అన్ని ఇండస్ట్రీల చూపూ సలార్‌పైనే ఉంది. ఈ మూవీ విడుదలయ్యే క్షణం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Niharika Konidela: వాట్‌ ద ఫిష్‌’.. మెగా డాటర్ సర్‌ప్రైజ్‌ అదిరిపోలా..!

KGF విషయంలో ఏ మిస్టేక్ చేశానో సలార్ విషయంలోనూ అదే చేశానన్నాడు ప్రశాంత్ నీల్. ఇంతకీ ఎంటా మిస్టేక్..? సలార్’ విడుదలకు ముందు వచ్చిన యాక్షన్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. దీంతో భారీ యాక్షన్ ఫిల్మ్ సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నామనే ఉత్సాహంతో ఉన్నారు. ప్రభాస్ కటౌట్, యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. KGF తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా కావడం కూడా అంచనాలు పెరగడానికి ముఖ్యమైన కారణం. ఆడియన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టైమ్‌లో అదే తప్పు మళ్లీ చేశానన్న ప్రశాంత్ నీల్ కామెంట్స్ షాకిచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో ‘సలార్’ గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు కూడా KGF విషయంలో చేసిన మిస్టేక్స్ రిపీట్ చేశా. ఫైనల్ ఎడిట్ చూస్తేనే కదా సినిమాను జడ్జ్ చేయగలం. కానీ నాకున్న సిట్యువేషన్స్ కారణంగా సినిమా చూడటం కుదరలేదు. కానీ ఒక్కసారి చూసి ఉంటే సినిమా ఎలా ఉంటుందో అర్థం అయ్యేది అన్నాడు. అయినా పర్లేదు.. చేసిన దానితో హ్యాపీగా ఉన్నాం అని కన్‌క్లూడ్ చేశాడు.

Rajinikanth: నేను చేయను.. రజనీకాంత్‌కు నో చెప్పిన షారుఖ్..

‘కెజియఫ్’ విడుదలకు ముందు ప్రశాంత్ నీల్ సినిమా చూడలేదట. అయినా ఆ మూవీ కన్నడ ఇండస్ట్రీ లెక్క మార్చేసింది. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా నిలబడింది. ఆ డైరెక్షన్, టేకింగ్ చూసి వాహ్ అనని వాళ్లు లేరు. లేటెస్ట్‌గా వచ్చిన సలార్ యాక్షన్ ట్రైలర్ కూడా అంతకుమించి అనేలా ఉంది. సో.. ఫైనల్ ఎడిట్ ప్రశాంత్ నీల్ చూసినా చూడకపోయినా బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్సైపోయారు ఫ్యాన్స్. సలార్.. ఇద్దరు స్నేహితుల కథ అన్న విషయంలో మాత్రం ప్రశాంత్ చాలా స్పష్టంగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రలర్లో ఇది చాలా క్లియర్‌గా అర్థమవుతోంది కూడా. వాళ్లు ఎందుకు శత్రువులుగా మారారు అన్నదే స్టోరీలో కీలక మలుపు. వరదరాజా మన్నార్, దేవా పాత్రలకు ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంటుంది.

ప్రభాస్ పాత్రను వరద ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ కట్టిపడేస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రభాస్ పాత్ర కంట్రోల్ తప్పితే.. అది మళ్లీ కంట్రోల్‌లోకి తీసుకురావడం తన వల్ల కూడా కాదు అని వరదాకు తెలుసు. కానీ ఒక సమయంలో ఆ కనెక్షన్ తెగిపోతుంది. అప్పుడు అసలు కథ మొదలవుతుంది. అయితే సలార్‌లో ఉన్న వైలెన్స్ వల్ల నెగిటివిటీ వస్తుందని అస్సలు అనుకోవడం లేదన్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్ ఫ్యాన్స్‌కి సలార్ ఫుల్ మీల్సే అని క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా శ్రుతిహసన్ నటిస్తోంది.