Prashanth Neel: భారీ సంస్థలు.. భారీ సినిమాలు.. ప్రశాంత్ నీల్ పవర్‌ఫుల్ లైనప్…
భారీ సినిమాలు అంటే బాలీవుడ్ వైపే చూసేవాళ్లు ఒకప్పుడు ! బాహుబలితో సీన్ పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సత్తా ఏంటో ఇండియాకే కాదు.. ప్రపంచానికి తెలిసొచ్చింది. భారీ సినిమాలు వరుసపెట్టి విడుదల అవుతూ.. బాలీవుడ్‌కు సవాల్ విసురుతున్నాయ్. సౌతిండియాలో కొంతకాలంగా హై రేంజ్ చిత్రాలు వస్తున్నాయ్.
వీటికి మార్గం చూపించింది రాజమౌళి అయితే.. ఆ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తూ సత్తా చాటిన డైరెక్టర్లు మరికొందరు. అందులో టాప్‌లో ఉంటాడు ప్రశాంత్ నీల్. కన్నడంలో మాస్ డైరెక్టర్‌గా పేరు ఉన్న ప్రశాంత్ నీల్.. యశ్ హీరోగా తీసిన కేజీఎఫ్ రెండు పార్టులూ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయ్. హిందీ మార్కెట్ మీద రాఖీభాయ్ చూపించిన ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. దీంతో ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు.. అన్ని ఇండస్ట్రీల నిర్మాతలు, హీరోలు పోటీ పడుతున్నారు.
కన్నడం తర్వాత తెలుగు సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి.. సలార్ సినిమా తీస్తున్నాడు. దీనికి సంబంధించి చాలావరకూ షూటింగ్ కూడా పూర్తయింది. దీనికితోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తోనూ ఓ క్రేజీ మూవీని చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఐతే ఆ తర్వాత ప్రశాంత్ చేయబోయే సినిమాల గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
పవర్‌ఫుల్ లైనప్ క్రియేట్ చేసుకున్నట్లు కనిపిస్తున్నాడు నీల్. ప్రస్తుతం హొంబళే ఫిల్మ్స్ సంస్థలో రెండు చిత్రాలు డైరెక్ట్ చేయడంతో పాటు ఒక సినిమాకు ప్రశాంత్ స్టోరీ అందింజబోతున్నడు. అలాగే మైత్రీ మూవీస్‌లో ఎన్టీఆర్‌తో సినిమా ప్రకటించాడు. వీటికితోడు దిల్ రాజు బ్యానర్‌లో ఒకటి.. డీవీవీ దానయ్యతో మరొకటి.. లైకా ప్రొడక్షన్స్‌లో మరొకటి సినిమాలు చేయబోతున్నాడు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లోనూ ప్రశాంత్ నీల్ సినిమా చేసే చాన్స్ ఉంది. భారీ సంస్థల్లో సినిమాలు అంటే.. భారీగానే ఉండడం ఖాయం. ఈ పవర్‌ఫుల్ లైనప్ సక్సెస్ అయితే.. ప్రశాంత్ మరో రాజమౌళి కావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.