డ్రాగన్ స్టార్ట్.. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ను మాస్ సాంగ్ తో లాంచ్ చేస్తున్న ప్రశాంత్ నీల్
దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ పై యుద్ధం ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా షూటింగ్ లో అటెండ్ అవుతున్నాడు.
దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ పై యుద్ధం ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా షూటింగ్ లో అటెండ్ అవుతున్నాడు. ఎప్పుడో ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు మొదలైనా ఇప్పటివరకు షూటింగ్ కు మాత్రం వెళ్లలేదు. అయితే రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం ఈ సినిమా షూటింగ్.. ప్రశాంత్ నీల్ కొంత కంప్లీట్ చేశాడని త్వరలోనే ఎన్టీఆర్ తో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళుతుందని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ నెల రెండో వారంలో జరిగే షెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా షూట్లో జాయిన్ అవుతున్న విషయం క్లారిటీ ఉన్న సరే మరికొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా వస్తున్న ఒక అప్డేట్ ప్రకారం ఎన్టీఆర్ తో ఒక మాస్ సాంగ్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టు టాక్. మాస్ ఆడియన్స్ ఎట్రాక్ట్ చేసే విధంగా ఈ సాంగ్ ప్లాన్ చేశాడని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సరే ఆ టైటిల్ కాకుండా మరో టైటిల్ ను ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ సినిమాను ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చేయాలని తాను ప్రయత్నం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసాడు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ చాలా కష్టపడుతున్నాడు. గతంలో వర్క్ చేసిన సినిమాలు కంటే ఈ సినిమా కోసం ఎక్కువగా టైం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ సినిమాలు అన్నిటిలోనూ ది బెస్ట్ సినిమా అవుతుందని అంచనాలు ఉన్నాయి.
ఆడియన్స్ ఊహించని రేంజ్ లో ఈ సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత ను తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఒక కీలక పాత్ర కోసం శివరాజ్ కుమార్ ని కూడా ఇప్పటికే ఫైనల్ చేశారు. త్వరలోనే ఆయన కూడా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. రీసెంట్ గా వార్ 2 షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు. ఈ సినిమాను ఒకేసారి కన్నడ తమిళ తెలుగు భాషల్లో షూటింగ్ చేయనున్నారు. ఎన్టీఆర్ కు దేవరా సినిమా తర్వాత కన్నడ సినిమాలో మార్కెట్ భారీగా పెరిగింది. అక్కడినుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.