Prashanth Neel: సలార్‌ను మించి #NTR31 ప్లాన్‌ చేస్తున్న ప్రశాంత్‌ నీల్‌..

కేజీఎఫ్‌ సినిమాతో వరల్డ్‌ వైడ్‌ గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం సలార్‌ సినిమాతో బిజీగా ఉన్న ఈ మూవీ మేకర్‌.. తన తరువాత ప్రాజెక్ట్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేయబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 6, 2023 | 12:57 PMLast Updated on: Jun 06, 2023 | 12:57 PM

Prashanth Neel Make Movie With Jr Ntr

ఈ సినిమా గురించి ఇప్పటికే ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చి ఫస్ట్‌ లుక్‌ కూడా రివీల్‌ చేశారు. ఇండియా పాకిస్థాన్‌ బోర్డర్‌ నేపత్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన శ్రద్ధా కపూర్‌, దీపికా పదుకొణె హీరోయిన్స్‌గా కనిపించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్‌31లో జూనియర్‌ పక్కన హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను ఫైనల్‌ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాకు మంచి ఫేమ్‌ ఉంది. ఆరోజుల్లోనే గ్లోబల్‌ స్టార్‌గా ప్రియాంక పేరు తెచ్చుకుంది.

అలాంటి ప్రియాంక చోప్రాను ఈ సినిమాలో హీరోయిన్‌గా పెడితే.. గ్లోబల్‌ స్థాయిలో ఈజీగా గుర్తింపు వస్తుంది, సినిమాకు మరింత బూస్టింగ్‌ ఇచ్చినట్టువుతుందని ప్రశాంత్‌ నీల్‌ అనుకుంటున్నారట. దీనిపై ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు ప్రియాంక ఓకే చెప్తే అధికారికంగా ప్రకటన వస్తుందంటున్నారు. అయితే ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర షూటింగ్‌ బిజీగా ఉన్నాడు. వెకేషన్‌ నుంచి ఇంటికి వచ్చేయడంతో తరువాత షెడ్యూల్‌ ప్లాన్‌ చేశాడు కొరటాల. ఈ షెడ్యూల్‌లో కూడా యాక్షన్‌ సీన్స్‌ తీయబోతున్నట్టు సమాచారం. అటు ప్రశాంత్‌ నీల్‌ కూడా సలార్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాకే ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్‌ అవుతుంది. అయితే హీరోయిన్‌ గురించి ఎప్పుడు అప్‌డేట్‌ ఇస్తారో చూడాలి.