SALAAR: సలార్ 2 షురూ.. ఎన్టీఆర్ వల్లే మారిన ప్రశాంత్ నిర్ణయం

సలార్ 2 కథ రాయటం కాదు, సలార్ 2 ని తీసేయాలనే ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట. అందుకే సలార్ 2 కథని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు సలార్ 2 కోసం ప్రభాస్‌ని డేట్లు కూడా అడిగేసినట్టు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2024 | 07:19 PMLast Updated on: Feb 03, 2024 | 7:19 PM

Prashanth Neel Planning To Do Salaar 2 Before Ntr Movie

SALAAR: సలార్ మూవీ 700 కోట్ల పైనే రాబట్టింది. తర్వాత ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో బిజీ అవుతాడన్నారు. కాని కథ అడ్డం తిరిగింది. ప్రశాంత్ నీల్ సలార్ 2 కథని ముందుగా రాసి ఆతర్వాతే ఎన్టీఆర్ మూవీ పనులు మొదలు పెడతాడనేశారు. కాని అక్కడ కూడా విచిత్రం జరుగుతోంది. సలార్ 2 కథ రాయటం కాదు, సలార్ 2 ని తీసేయాలనే ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట. అందుకే సలార్ 2 కథని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

YS JAGAN: మీకోసం 124 సార్లు బటన్ నొక్కా.. జగనన్న కోసం రెండుసార్లు బటన్ నొక్కలేరా: జగన్

అంతేకాదు సలార్ 2 కోసం ప్రభాస్‌ని డేట్లు కూడా అడిగేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చ్‌లో కల్కి పూర్తవుతుందని, జూన్‌లోగా మారుతి మేకింగ్‌లో ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ కూడా 90శాతం పూర్తవుతుందని తెలుస్తోంది. అయితే జూన్‌లో సలార్ 2ని మొదలు పెట్టేందుకు ప్రశాంత్ నీల్ రంగం సిద్దం చేస్తున్నాడు. సలార్ 1ని తెరకెక్కించినప్పుడే పార్ట్ 2 తాలూకు కొన్ని సీన్లు తీసిన ప్రశాంత్ నీల్ సలార్ 2ని జూన్ నుంచి డిసెంబర్‌లోగా పూర్తి చేసి సమ్మర్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నాడట.

వచ్చే ఏడాది జనవరి నుంచి ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టి, సమ్మర్‌లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళతాడట. ఎన్టీఆర్ దేవర 1 ఇంకా షూటింగ్ డిలే అవుతుండటం, వార్ 2 మూవీకే 6 నుంచి 7నెలల డేట్లను ఎన్టీఆర్ ఇచ్చేయటంతో, ఇలా తనొచ్చేలోగా సలార్ 2 ని ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్.