లిప్ లాక్ సీన్ ఆ హీరోయిన్ కు చాలా ఈజీ.. విద్యాబాలన్ పై హీరో కామెంట్స్
లిప్ లాక్ సీన్స్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ సినిమాలోనే ముందుంటారు. హాలీవుడ్ తర్వాత ఆ రేంజ్ లో లిప్ లాక్ సీన్స్ కు బాలీవుడ్ బాగా ఫేమస్ అయిపోయింది.
లిప్ లాక్ సీన్స్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు ఇండియన్ సినిమాలోనే ముందుంటారు. హాలీవుడ్ తర్వాత ఆ రేంజ్ లో లిప్ లాక్ సీన్స్ కు బాలీవుడ్ బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు మాజీ స్టార్ హీరోయిన్లు అందరూ లిప్ లాక్ సీన్స్ విషయంలో ఆరితేరిపోయారు. డైరెక్టర్ ఏ సీన్ చెప్పిన సరే నో చెప్పకుండా కంప్లీట్ చేసేవారు హీరోయిన్లు. ఒకప్పుడు లిప్ లాక్ సీన్ అంటే సినిమాల్లో సెన్సేషన్ అయ్యేది. ఇప్పుడు మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమానే తేడా లేకుండా లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ గా వచ్చేస్తున్నాయి. మన తెలుగులో కూడా ఈ ట్రెండ్ గట్టిగానే నడుస్తోంది.
ఇక బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ లిప్ లాక్ సీన్స్ విషయంలో చాలా సీనియర్. చాలా సినిమాల్లో ఆమె లిప్ లాక్ సీన్స్ లో ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆక్ట్ చేసింది. ఆమె గురించి లేటెస్ట్ గా ప్రతీక్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్కాం 1992 ది హర్షద్ మెహత స్టోరీలో అదిరిపోయే యాక్టింగ్ తో దుమ్మురేపిన ప్రతీక గాంధీ రీసెంట్గా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిప్ లాక్ సీన్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. సినిమాలోని తన లిప్ లాక్ సీన్ గురించి ఓపెన్ అయిన ఈ యాక్టర్ విద్య తన మొట్టమొదటి ఆన్ స్క్రీన్ ముద్దును స్క్రీన్ పై పండించేందుకు ఎలా రీజన్ అయిందో బయట పెట్టాడు.
పవర్ఫుల్ నటనతో పాపులారిటీ సంపాదించుకున్న ప్రతి తాను ఇంతకుముందు ఎప్పుడు లిప్ లాక్ సీన్స్ లో నటించిన అందువల్లే ఫస్ట్ కిస్ విషయంలో ఇబ్బంది పడ్డానని గుర్తు చేసుకున్నాడు. తనకు ఎంతో ఇబ్బంది కలిగించిన.. ఆ సిచువేషన్ చాలా సింపుల్ గా కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేసేందుకు విద్యాబాలన్ తనకు చాలా హెల్ప్ చేసిందని చెప్పుకొచ్చాడు. ప్రొఫెషనల్గా యాక్టర్ గా ఉన్నప్పటికీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి తనకు వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆయన బయటపెట్టాడు. ఒక విషయం చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయని కేవలం కళ్ళతోనే చూపించవచ్చంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ సినిమాలోని లిప్ లాక్ సీన్ ఏం కోరుకుంటుందో విద్యకు తెలుసని అందుకే దాన్ని చాలా సింపుల్ గా కంప్లీట్ చేశామని డైరెక్టర్ ఏమి అడుగుతాడో కూడా ఆమెకు క్లారిటీ ఉందని అందుకే ఆమె చేసిన విధానం అంత పర్ఫెక్ట్ గా ఉందంటూ చెప్పుకొచ్చాడు. సీనియర్ యాక్టర్ గా దాన్ని ఆమె పండించగలిగారంటూ బయట పెట్టాడు. ఆ సన్నివేశం షూట్ చేసే టైంలో ఆమె చాలా ఉల్లాసంగా ఉందని అది నా పరిస్థితిని పూర్తి తేలికగా మార్చేసింది అంటూ కామెంట్స్ చేశాడు. చాలా నవ్వుతూనే ఆ సీన్ కంప్లీట్ చేశామని ఆమె సపోర్టివ్ నేచర్ ను ప్రతి ఎంతగానో కొనియాడాడు.