Bigg Boss 7 : అమర్ కోసం రొయ్యల బిర్యానీ.. అర్జున్ కోసం మటన్ కర్రీ..

తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపుకు వచ్చేసింది.. ఫినాలేకి ముందు హౌస్‌మేట్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. మీ ఇంటి వంట అంటూ ఆఫర్ ఇచ్చారు.. ప్రతి ఒక్కరికీ వాళ్ల ఇంటి వంటను ఆస్వాదించే ఛాన్స్ ఇచ్చాడు.. ఇక.. వచ్చిందే ఛాన్స్‌ అనుకుంటూ అర్జున్‌, అమర్‌దీప్, శివాజీ తమ ఇంటి ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ కుమ్మేశారు.. ఇక నామినేషన్లు లేకపోవడంతో హౌస్‌లో పెద్దగా హడావిడి కనిపించలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 15, 2023 | 10:25 AMLast Updated on: Dec 15, 2023 | 10:25 AM

Prawn Biryani For Amar Mutton Curry For Arjun

తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపుకు వచ్చేసింది.. ఫినాలేకి ముందు హౌస్‌మేట్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. మీ ఇంటి వంట అంటూ ఆఫర్ ఇచ్చారు.. ప్రతి ఒక్కరికీ వాళ్ల ఇంటి వంటను ఆస్వాదించే ఛాన్స్ ఇచ్చాడు.. ఇక.. వచ్చిందే ఛాన్స్‌ అనుకుంటూ అర్జున్‌, అమర్‌దీప్, శివాజీ తమ ఇంటి ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ కుమ్మేశారు.. ఇక నామినేషన్లు లేకపోవడంతో హౌస్‌లో పెద్దగా హడావిడి కనిపించలేదు.

హ్యాపీ డేస్ సినిమాలోని పాదమెటు “పోతున్నా.. పయనమెందాకైనా” సాంగ్ వేసి.. ఉదయాన్నే హౌస్‌మేట్స్‌ని ఎమోషనల్ చేశారు బిగ్‌బాస్.. ఈ పాటతో ఎమోషనల్ అయిపోయిన హౌస్‌మేట్స్ అందరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటూ.. డ్యాన్స్‌లు చేశారు. జనాలతో పాటుగా హౌస్ మెట్స్ కూడా జోష్ ను పెంచేందుకు ఆచి పేరుతో డిఫరెంట్ టాస్క్ లను బిగ్ బాస్ ఇచ్చారు.. కుటుంబ సభ్యులు పంపిన వంటకాలు దక్కించుకోవాలనుంటే వారి తరుపున ఇతర సభ్యులు గేమ్ ఆడి గ్రహాంతరవాసులని మెప్పించాలి. ముందుగా అర్జున్ సతీమణి తన భర్త కోసం మటన్ కర్రీ, రాగి ముద్ద పంపింది. అర్జున్ తన భార్య పంపిన ఫుడ్ అందుకోవాలంటే యావర్ షేక్ బేబీ షేక్ గేమ్ గెలవాలి. గతంలో లాగా కాకుండా యావర్ అద్భుతంగా గేమ్ ని ఫినిష్ చేశాడు.. ఆ వంటను అందరికీ పంచాడు.

ఆ తర్వాత శివాజీకి తన ఫ్యామిలీ నుంచి ఫుడ్ వచ్చింది. శివాజీ కొడుకు వీడియో సందేశం ద్వారా.. నాన్న నీకు చికెన్ కర్రీ పంపిస్తున్నాం. హైదరాబాద్ లో డబ్బులు లేని సమయంలో ఆకలితో పార్క్ లో పడుకున్న రోజులని గుర్తు చేశాడు. ఆ మాటలకు శివాజీ ఎమోషనల్ అయ్యాడు.. అలాగే అమర్ కోసం రొయ్యల బిరియాని వచ్చింది. దానికోసం శివాజీకి ఒక టాస్క్ ను ఇచ్చాడు.. అది పూర్తికాగానే ఆ ఫుడ్ ను తీసుకొని టేస్ట్ చేసి అందరికీ ఇచ్చాడు. ఫుడ్ ని ఎంజాయ్ చేసిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చిన్న టాస్క్ ఇచ్చారు. హౌస్ లో ఇన్ని రోజుల పెర్ఫామెన్స్ ని బట్టి 60 నిమిషాల ఎపిసోడ్ లో కనిపించాల్సి వస్తే మీకు మీరు ఎన్ని నిమిషాలు ఎంచుకుంటారు. ఇతరులకి ఎన్ని నిమిషాలు ఇస్తారు అని బిగ్ బాస్ ప్రశ్నించారు. దీనితో అర్జున్ 10 నిమిషాలు కనిపిస్తా అని మెడలో ఆ ట్యాగ్ వేసుకున్నారు.. అమర్, శివాజీలు కూడా ట్యాగ్ వేసుకున్నారు.

ఇక విన్నర్ రేసులో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రైతుబిడ్డ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక.. గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ స్టేజ్ పై ఈసారి శ్రీమంతుడు సందడి చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మహేష్ బాబుతో కలిసి నందమూరి హీరో బాలకృష్ణ సైతం రాబోతున్నారంటూ ఓ టాక్‌ హల్‌చల్ చేస్తోంది.. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన రానప్పటికీ.. ఈ ఇంట్రస్టింగ్ న్యూస్ మాత్రం వైరల్‌గా మారింది.