Prabhas: సలార్ సిద్దమౌతోంది.. అందరి కళ్లు ప్రభాస్ పైనే..
సలార్ సినిమా టికెట్స్ యూఎస్ లో ప్రారంభమైయ్యాయి.

Pre-booking tickets of Salaar movie directed by Prashant Neel starring Prabhas as hero are being done in US
సలార్ రిలీజ్ కి టైం దగ్గరపడుతోంది.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చూసేందుకు ఆడియన్స్ లో అటెన్షన్ పెరిగింది. దానికి తగ్గటే అడ్వాన్స్ బుకింగ్స్ ని USలో స్టార్ట్ చేశారు మేకర్స్. ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది సలార్.
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లో యాక్షన్ సీక్వెన్స్ లు ‘కేజీఎఫ్’ ని మించి ఉంటాయని, క్లైమాక్స్ లో ఏకంగా వెయ్యి మందితో ప్రభాస్ తలపడతాడని కామెంట్స్ రావడంతో హైప్ ఎవరెస్ట్ ఎక్కింది. దానికి తగ్గేటే USలో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేక్కుల్లా అమ్ముడు పోతున్నాయి. ప్రీ సేల్స్ రూపంలో ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
యూఎస్ లో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. కానీ కొన్ని చోట్ల సోమవారం నుండే స్టార్ట్ చేశారు.అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటలకే ప్రీ సేల్స్ రూపంలో ఇప్పటికే లక్ష డాలర్లను సలార్ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.రిలీజ్ కి ఇంకా 30రోజులు టైం ఉంది కాబట్టి అప్పటికి ఈ సంఖ్య త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇండియాలో రెండు వారాల ముందు సలార్ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో టికెట్ అమ్మకాలు షురూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేసి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నెలాఖరికి ట్రైలర్ ని విడుదల చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడ జరగబోతున్నాయి అనేది ఇంకో వారంలో డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది.మొత్తానికి సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ తో డిలా పడ్డ డార్లింగ్ ఫ్యాన్స్ కి సలార్ ఫుల్ మిల్స్ అందించడం పక్కా అంటున్నారు క్రిటిక్స్.