దేవర లానే రిలీజ్ కి ముందు వండర్స్… నిజమేనా..?
దేవర రిలీజ్ కి ముందు 5 మిలియన్ల వరకు అడ్వాన్స్ బుక్కింగ్స్ ని రాబట్టాడు. కరెక్ట్ గా రిలీజ్ కి నెల ముందే ఇలా దేవర దుమ్ముదులిపాడు.. కట్ చేస్తే పుష్ప 2 రిలీజ్ కి 28 రోజులు ముందు హాఫ్ మిలియన్ డాలర్స్ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో వచ్చాయన్న పోస్టర్ వచ్చింది.
దేవర రిలీజ్ కి ముందు 5 మిలియన్ల వరకు అడ్వాన్స్ బుక్కింగ్స్ ని రాబట్టాడు. కరెక్ట్ గా రిలీజ్ కి నెల ముందే ఇలా దేవర దుమ్ముదులిపాడు.. కట్ చేస్తే పుష్ప 2 రిలీజ్ కి 28 రోజులు ముందు హాఫ్ మిలియన్ డాలర్స్ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో వచ్చాయన్న పోస్టర్ వచ్చింది. దేవర ఓటీటీ రైట్స్ 270 కోట్లన్న న్యూస్ వచ్చిన మూడు రోజులకే పుష్ప 2 ఓటీటీ రైట్స్ 270 కోట్లన్న వార్త వైరలైంది. ఇప్పుడు ముంబైలో ట్రైలర్, బెంగులూరులో సాంగ్ లాంచ్ లను చూస్తే దేవర ఎక్కడ ఏ అడుగేశాడో, అక్కడ అలాంటి అడుగే పుష్ప2 టీం వేస్తోందా? లేదంటే బన్నీ నిర్ణయాలు కేవలం కో ఇన్స్ డెన్సా.. ఎంత కో ఇన్స్ డెన్స్ అయినా, దేవర రిలీజ్ కి ముందు చేసిన వండర్సే పుష్ప2 కి యాజ్ ఇట్ ఈజ్ ఎలా సాధ్యం… ఇదే నిజమైతే గొప్ప విషయమే.. కాని ఇది పబ్లిసిటీ స్టంటా? దేవర దారిలో వెళితే మంచిదే కాని, రికార్డులు కూడా అలానే వస్తుండటంతో, ఎక్కడ లేని డౌట్లొస్తున్నాయి.
దేవర రిలీజ్ కి ఎగ్జాక్ట్ గా నెల ముందు హాఫ్ మిలియన్ డాలర్స్, యూఎస్ లో కేవలం అడ్వాన్స్ బుక్కింగ్స్ తోనే వచ్చాయి. అలానే ప్రివ్యూకి 4.5 మిలియన్ డాలర్లు, ఫస్ట్ డేకి ఏకంగా 2 మిలియన్ డాలర్లు.. ఇలా మొత్తంగా దేవర ఆరుమిలియన్ డాలర్స్ తో చరిత్ర స్రుష్టించింది. విడుదలయ్యాయ ఓపెనింగ్స్ తో 172 కోట్ల వసూళ్ల రికార్డు సెట్ చేసింది.. ఇందులో 90 కోట్లు కేవలం నార్త్ ఇండియా నుంచే వచ్చాయి.
ఇలాంటి రికార్డులు దేవర విడుదలైన వారానికి , రెండు వారాలకి, మూడు వారాలకి ఇలా, ప్రతీ వారం ఏదో ఒక రికార్డు రీసౌండ్ చేస్తూనే వచ్చింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న వంతొచ్చింది. విచిత్రం ఏంటంటే పుష్ప 2 టీం, ఈ సినిమా రిలీజ్ కి 28 రోజులు ముందే యూఎస్ లో హాఫ్ మిలియన్ సొంతంచేసుకుందట. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే 25 వేల టిక్కెట్లు బుక్ అయ్యాయట. అంటే టిక్కెట్ 20 డాలర్ల చొప్పున 5 లక్షల డాలర్లు వచ్చేసినట్టే
అచ్చం ఇదేదో దేవర రికార్డ్ లానే ఉంది. ఓటీటీ రైట్స్ కూడా దేవర 270 కోట్లంటే, పుష్ప 2 కూడా అంతే మొత్తానికి డీల్ సెట్ అయ్యిందని వార్తలొచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే, దేవర దారిలోనే పుష్ప2 కి కలిసొస్తుందా? అలా అని ప్రచారం చేస్తున్నారా తెలియట్లేదు.
పుష్ప లాంటి హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి పుష్ప2 కి క్రేజ్ తక్కువేం ఉండదు. ట్రెండ్ సెట్ చేసిన సినిమాకు రెండో భాగా వస్తోందంటే ఆ క్రేజ్ ఉంటుంది. కాని దేవర క్రియేట్ చేసిన రికార్టులే కాపీ జిరాక్స్ లా పుష్ప 2 కి కూడా సొంతమౌతుంటే కొత్త కొత్త డౌట్లు పెరిగిపోతున్నాయి
ఇక పుష్ప 2 ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేయలానుకోవటం కూడా దేవర ప్రమోషన్ స్టైల్ ని కాపీ చేయటం లాంటిదే.. అదేజరుగుతోంది. అంతేకాదు జానీ మాస్టర్ జైలుకెళ్లటం, తను కొరియోగ్రాఫ్ చేసిన పాట మరొకరితో మళ్లీ ప్లాన్ చేయించటం లాంటివి చాలా టైం కిల్ అయ్యేలా చేశాయి. దీంతో శ్రద్దా కపూర్ తో అనుకున్న సాంగ్ ని కూడా లేపేసింది ఫిల్మ్ టీం.
అంతేకాదు ఈ సినిమాకు ఇంకా బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు పూర్తికాకపోవటంతో, సీన్ లోకి తమన్, అజనీష్ వచ్చారు.ముగ్గురు కలిసి, మూడు గంటల మూవీలో తలా ఓ గంట బీజీఎం పనులు పంచుకుంటున్నారని తెలుస్తోంది. ఏదేమైనా దేవర స్టైల్లో అన్నీ ఉన్నాయి, కాని పనులుమాత్రం ముందే దేవర స్టైల్లో పూర్తి కాలేదు. బేసిగ్గా లెక్కల మాస్టరైన సుకుమార్, పుష్ లానే పుష్ప 2 విషయంలో కూడా లెక్క తప్పుతున్నాడు.