Prime Minister: సఫారీ, టోపీ.. మోదీ లుక్ అదుర్స్.. ఆస్కార్ విజేతలకు ప్రధాని ప్రశంస
ముదుమలై పులుల పరిరక్షణ కేంద్రాన్ని సందర్శించారు మోడీ. ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్, వల్లిని కలిశారు. డాక్యుమెంటరీలోని ఏనుగు రఘు దగ్గరికి వెళ్లిన ప్రధాని దానిని ముద్దు చేశారు. రఘుకు చెరుకుగడలు తినిపించారు. ఆస్కార్ అవార్డుతో కర్నాటకలోని ముదుమలై ఫారెస్ట్ ప్రతిష్టాత్మకంగా మారింది. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ.
ఈ డాక్యుమెంటరీలో ముదుమలై పులుల పరిరక్షణ కేంద్రం కీలకంగా మారింది. దీన్నే మోదీ సందర్శించారు. ప్రాజెక్ట్ టైగర్ 50ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బాందీపూర్ టైగర్ రిజర్వాయర్‌కి వెళ్లిన ప్రధాని.. ముదుమలై ఫారెస్ట్‌ని సందర్శించారు. బాందీపూర్ అభయారణ్యం.. పులులు, ఏనుగులు, జింకలు, అడవిదున్నలు.. ఇలా ఎన్నో రకాల వన్యప్రాణులు, అంతరించిపోయే దశలో జీవరాసులకు ఆలవాలంగా ఉంది.
ఇక్కడి ముదుమలైలో ఏనుగుల సంరక్షణ కేంద్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని చూసేందుకు, వీటికి ఫీడింగ్ చేసేందుకు టూరిస్ట్‌లు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలో కనిపించిన రఘు అనే ఏనుగు ఇక్కడే ఉంది. ముదుమలై పరిరక్షణ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో మోదీ లుక్.. కేకు పుట్టిది. సఫారీ దుస్తులు, టోపీలో ప్రధాని కనిపించారు. అక్కడ కూడా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.
ఈ టైగర్ రిజర్వ్‌లోని కొంతభాగం చామరాజనగర్ జిల్లా.. మరికొంత భాగం మైసూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. 1973లో పులుల్ని వాటి ఆవాసాల్ని రక్షించేందుకు రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాలను విస్తరించి 880 చదరపు కిలోమీటర్లతో ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 3వేల పులులు ఉన్నాయి. ప్రపంచ పులుల లో 70 శాతానికి పైగా మనదేశంలోనే ఉన్నాయి. తాజా అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య సంవత్సరానికి 6 శాతం చొప్పున పెరిగిందని అధికారులు ప్రస్తుతం బంధీపూర్ టైగర్ రిజర్వ్ విస్తీర్ణం 912 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. అంతరించిపోతున్న ఆసియా అడవి ఏనుగులకు ఇదే చివరి ఆశ్రయం. ఈ టైగర్ రిజర్వ్‌లో ఎన్నో అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతులు కనిపిస్తాయి.