పాపం ప్రియాంకా చోప్రా.. నవ్వుతున్న ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు. రాజమౌళి.. ప్లానింగ్ వేరే డైరెక్టర్ కంటే పక్కాగా డిఫరెంట్ గా ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2025 | 07:35 PMLast Updated on: Jan 24, 2025 | 7:35 PM

Priyanka Chopra Chance Get To Rajamouli Movie

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు. రాజమౌళి.. ప్లానింగ్ వేరే డైరెక్టర్ కంటే పక్కాగా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే సక్సెస్ ఆయన గుమ్మం దగ్గర నిలబడుతుంది. ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో జక్కన్న డైరెక్ట్ గా హాలీవుడ్ నే టార్గెట్ చేశాడు. హాలీవుడ్ లో పాగా పాగా వేయడానికి ఈ సినిమాను వాడుకోవాలని ఒక పక్కా స్కెచ్ తో అడుగు పెడుతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ పై గురి పెట్టిన రాజమౌళి ఆ తర్వాత ఆస్కార్ కొట్టి తాను ఏంటి అనేది ఇండియన్ సినిమాకు ప్రూవ్ చేసుకున్నాడు.

మహేష్ బాబుతో చేసే సినిమా పాన్ వరల్డ్ హిట్ కావాలని కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో రాజమౌళి ముందు నుంచి ఎవరిని ఫైనల్ చేయాలనే దానిపై ఇప్పటివరకు ఒక అంచనాకు రాలేదు. అయితే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేసినట్టు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ప్రియాంక హైదరాబాదులో ల్యాండ్ అయింది చిలుకూరు బాలాజీ టెంపుల్ లో దర్శనం కూడా చేసుకుంది. ఇక రాజమౌళి అండ్ టీంకు ప్రియాంక లుక్ టెస్ట్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు సినిమాలో నటించాలా వద్దా అనే నిర్ణయాన్ని ప్రియాంక చేతుల్లోనే పెట్టాడు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి.. ప్రియాంకను బల్క్ డేట్స్ అడుగుతున్నారని టాక్. దాదాపు ఏడాది పాటు ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాలని ప్రియాంక చోప్రాను రాజమౌళి అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలతో బిజీగా అమెరికా ఇండియా తిరుగుతోంది. హాలీవుడ్ అవకాశాలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ టైంలో రాజమౌళి సినిమాకు ఏడాది పాటు ఈ వయసులో ఆమె డేట్స్ ఇస్తుందా అనేది చెప్పలేని పరిస్థితి.

ఏడాది అంటే అది కచ్చితంగా మూడేళ్ళు. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కాబట్టి ఒక రకంగా ఓకే చెప్పే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ డేట్స్ ఇచ్చే విషయంలో ఆమె దాదాపుగా ఓకే చెప్పొచ్చు. కాని మూడేళ్ళు కిల్ అయిపోతుంది. ఇక ఆ డేట్స్ అంతకుముందు ఎవరికైనా ఇచ్చి ఉంటే మాత్రం కచ్చితంగా ఇబ్బంది. ఈ సినిమాలో నటించే నటులందరి డేట్స్ ను రాజమౌళి ఇలాగే అడుగుతున్నారట. కాకపోతే ఇక్కడ షూటింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాకుండానే డేట్స్ అడగటం దానికి తోడు రాజమౌళి చాలా స్లోగా సినిమా చేస్తారని ఇమేజ్ ఉండటంతో యాక్టర్స్ లో కాస్త భయం మొదలైంది. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సెట్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. అక్కడే షూటింగ్ కొంత పార్ట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఆఫ్రికా వెళ్లే ఛాన్స్ ఉంది.