Priyanka Chopra: 204 కోట్ల నెక్లెస్.. 50 కోట్ల డ్రెస్సు.. 20 కోట్ల వాచ్..
ప్రియాంకా చోప్రా 204 కోట్ల విలువైన నెక్లెస్ పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. 11. 6 కేరట్ల డైమాండ్ పొదగబడిన ఆనెక్లెస్ విలువ 204 కోట్లు. ఏడాదికి 350 కోట్లు సంపాదించే ప్రియాంకా దాదాప తన ఏడాది సంపాదనతోనే ఆ డ్రెస్సుని నెక్లెస్ ని కొనుక్కకుందా? ఇది చాలా మంది డౌట్.
తనే కాదు ఆలియా భట్ కూడా 10 వేల ముత్యాలతో 50 కోట్లు విలువైన డ్రెస్ ని వేసుకుని అమెరికాలోనీ మెట్ గాలా ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ లో దర్శనమిచ్చింది. అదేంతో కాన్స్ ఫెస్టివల్, బెర్లిన్ సినీ మహోత్సవం అంటే, అక్కడకి పిలవకున్నా లక్షలు పోసి టిక్కెట్లు కొని, రెడ్ కార్పేట్ మీద దర్శనమివ్వటం బాలీవుడ్ హీరోయిన్లకు అలవాటు.. ఆలియాని కూడా పిలవకున్నా, పిలవని పేరంటానికి టిక్కెట్లు కొని 50 కోట్ల డ్రెస్ ని అద్దెకి తీసుకొని మరీ వెళ్లందట.
నిజానికి ప్రియాంక 204 కోట్ల నెక్లెస్ తనకి భర్త నిక్ గిఫ్ట్ గా ఇచ్చిందేనట. ఇక ఆలియా భట్ ధరించిన ముత్యాల డ్రెస్ మాత్రం రెంటెడ్ అని ప్రచారం జరుగుతోంది. మొన్న సమంత కూడా ఇలానే పాము నెక్లెస్, పాము ఆకారంలో డైమండ్ బ్రేస్ లెట్ వేసుకుంది. దాని ధర 2 కోట్లన్నారు. ఇదే కాదు షారుఖ్ కొడుకు ఈమధ్య తన బట్టల దుకాణంలో 2 లక్షలకి జాకెట్టు, 25 వేలకి టీషర్టు సేల్ చేస్తే మొత్తం అమ్ముడు పోయింది.. ఇది చూసే ఇదేం మాయరోగం, 2 లక్షలకు ఓ జాకెట్ సింపుల్ గా చెప్పాలంటే ఓ జర్కిన్.. దాన్ని అంత పోటి కొన్న మహాత్ములు కేవలం షారుఖ్ రిలేటివ్సే అయ్యుంటారు. లేదంటే తన వారసుడికోసం జనం ఎందుకు అంతపోసి కొంటారంటున్నారు. ఏదేమైనా బాలీవుడ్ లో హిట్లు లేకున్నా, డ్రెస్సులు, నగలతో కోట్లలు వెనకేసుకుంటున్నారు. లేదంటే కోట్లు తగలేస్తున్నారు. మొత్తానికి ఇలా వార్తల్లో నిలుస్తున్నారు.