Pawan Kalyan: పవన్ కళ్యాణ్ OGలో సలార్ బ్యూటీ
సుజిత్ డైరెక్షన్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ రేపుతున్న క్యూరియాసిటీ అంతా ఇంతా కాదు. రోజుకో అప్డేట్ వదులుతున్న మూవీ టీమ్.. సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

Pawan Kalyan and Priya Mohan in OG movie
ఓజీలో పవన్ కల్యాణ్.. గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్ యాక్ట్ చేస్తోంది. ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ క్రేజీ అనిపిస్తోంది. తెలుగమ్మాయి, నటి శ్రియా రెడ్డి ఓజీలో యాక్ట్ చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఆమె కేరక్టర్ ఏంటో చెప్పకపోయినా.. ఆమె పాత్ర చుట్టూ వినిపిస్తున్న లీక్‌లు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయ్.
ఔట్ అండ్ ఓట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కాబట్టి.. శ్రీయా రెడ్డిది కచ్చితంగా పవర్‌ఫుల్ రోల్ అయి ఉంటుందని.. అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు. పందెం కోడి సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో శ్రియా రెడ్డికి మంచి పేరు వచ్చింది. అంతకు ముందు పొగరు సినిమాలో కథానాయికగా నటించారు. తెలుగులో అమ్మ చెప్పింది, అప్పుడప్పుడు సినిమాలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ కూడా చేస్తోంది.
పవన్ వారాహి యాత్ర మొదలు కావడంతో.. ఓజీ సహా మిగతా సినిమా షూటింగులకు బ్రేక్ వస్తుందని అనుకున్నారు అంతా. ఐతే అలాంటి సందేహాలకు చెక్ పడింది. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయాలతో పాటు సినిమా షూటింగులకు టైమ్ కేటాయిస్తానని పవన్ చెప్పడంతో ఏపీలో షూటింగులు జరగనున్నాయ్. జూన్ తొలి వారంలో హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులు షూటింగ్స్ చేశారు. ఓజీ చిత్రీకరణ అక్టోబర్ నెలకు పూర్తి అయితే పవర్ స్టార్ అభిమానులకు పండగే. జూలై 28న బ్రో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఓజీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది పవన్ నుంచి మరో సినిమా రావచ్చు.