ఒక్క రాత్రి సె*క్స్ చేస్తే వ*ర్జినిటీ పోతుంది..!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇండియా అమెరికా షటిల్ సర్వీస్ చేస్తుంది. అక్కడ, ఇక్కడ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ అమ్మాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 02:55 PMLast Updated on: Feb 25, 2025 | 2:55 PM

Priyqanka Chopra Sensational Comments

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇండియా అమెరికా షటిల్ సర్వీస్ చేస్తుంది. అక్కడ, ఇక్కడ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ అమ్మాయి. బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులు వస్తున్నా హాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ వర్క్ చేస్తుంది. ఇక హాలీవుడ్ కోడలు కూడా అయిపోయింది. ప్రియాంక చోప్రా ఇప్పుడు మన తెలుగుపై కూడా ఫోకస్ పెట్టింది. తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేస్తోంది ఈ అమ్మడు. అయితే ఈ సినిమాలో ఈమె హీరోయిన్నా లేదంటే విలనా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

రాజమౌళి ఆమెను ఏ రేంజ్ లో చూపిస్తాడనే దానిపై జనాలు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ప్రియాంక చోప్రా.. మహేష్ బాబుతో కీలక సన్నివేశాలను రాజమౌళి షూట్ చేస్తున్నాడు. ఆ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళిద్దరి రోల్స్ గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించడంతో బాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు. రాజమౌళి సినిమాలంటే వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంటుంది.

అలాంటిది ప్రియాంక చోప్రా లాంటి హాలీవుడ్ రేంజ్ హీరోయిన్ నటించడం అంటే ఆ లెవెల్ వేరే. ఇక ప్రియాంక చోప్రా ఈమధ్య సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ కొన్ని సెన్సేషన్ అవుతున్నాయి. తాజాగా ఈమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చాలా మంది వ్యక్తులు తమ భార్యలు వర్జిన్ గా ఉండాలని కోరుకుంటారని.. కానీ వర్జినిటీ అనేది అంత ముఖ్యమైన విషయం కాదని బోల్డ్ గా క్లారిటీ ఇచ్చేసింది. వర్జినిటీ అనేది ఒక రాత్రిలో పోతుందని దానికోసం పెద్దగా పట్టించుకోవద్దు అంటూ ప్రియాంక చోప్రా క్లారిటీ ఇచ్చింది.

అర్థం చేసుకుని నచ్చిన విధంగా ఉండే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకోవాలంటూ అడ్వైస్ ఇచ్చింది. ఎందుకంటే మంచి చెడు అనేది మనిషి ముఖం మీద కనిపించదని కామెంట్ చేసింది. ఒక అమ్మాయి ఒక మగాడిని నమ్మితే ఏదైనా చేస్తుందంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. కానీ కలిసిన ప్రతి జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని లేదని.. అందుకు అదృష్టం ఉండాలి అంది అది వర్కౌట్ అవ్వనప్పుడు.. ఇంకొకరితో జీవితం పంచుకుంటామని, అలాంటప్పుడు వర్జినిటీ గురించి పట్టించుకోవద్దని క్లారిటీ ఇచ్చింది.

అప్పుడప్పుడు బోల్డ్ గా మాట్లాడే ప్రియాంక చోప్రా ఇప్పుడు వర్జినిటీ గురించి ఈ రేంజ్ లో చేసిన కామెంట్స్ కాస్త సెన్సేషన్ అవుతున్నాయి. తనకంటే దాదాపు పదేళ్ళ చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా.. ఇప్పటికే తల్లి కూడా అయింది. అప్పట్లో ఈమెకు బాలీవుడ్ లో పలువురు హీరోలతో ఎఫైర్లు ఉన్నాయని రూమర్స్ వచ్చాయి.