నా సినిమాలు బ్యాన్ చేయండి.. ఎవడు చూడమన్నాడు.. రివ్యూలు రాయకండి..!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది నిర్మాతలు ఉన్న నాగవంశీ మాత్రం డిఫరెంట్. మనోడు ఒక్క ప్రెస్ మీట్ పెడితే చాలు కావాల్సినంత కంటెంట్ వస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2025 | 02:52 PMLast Updated on: Apr 01, 2025 | 4:17 PM

Producer Nagavamsi Sensational Comments

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది నిర్మాతలు ఉన్న నాగవంశీ మాత్రం డిఫరెంట్. మనోడు ఒక్క ప్రెస్ మీట్ పెడితే చాలు కావాల్సినంత కంటెంట్ వస్తుంది. అడిగిన అడగకపోయినా సినిమాల గురించి చెప్తూనే ఉంటాడు. చాలా భోళా మనిషి. అలాగే తన సినిమాను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అక్కడే తాటతీస్తాడు. చాలామంది నిర్మాతలకు అలా మాట్లాడాలని ఉంటుంది కానీ.. బయటపడడానికి ఇష్టపడరు. కానీ సూర్యదేవర నాగవంశీ మాత్రం అలా కాదు. తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు.. ఏది అనాలనిపిస్తే అదే అంటాడు..! ఇప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన. అందులో నాగవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదలైన తర్వాత కొన్ని వెబ్సైట్స్ లో వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత.. ఈ ప్రెస్ మీట్ పెట్టాడు వంశీ. తన సినిమాను కావాలనే కొందరు తొక్కేస్తున్నారని.. కలెక్షన్స్ వస్తున్నా కూడా రావట్లేదు అని రాస్తున్నారని.. సినిమాలో విషయం లేకపోయినా ఆడుతుంది అంటూ అనవసర ప్రచారం చేస్తున్నారు అంటూ నాగ వంశీ ఫైర్ అయ్యాడు. కేవలం తాము రాసిన రివ్యూ కరెక్ట్ అని నిరూపించుకోవడానికి.. తన సినిమాను తప్పు అని రాస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డాడు.

తమ మీద బతుకుతూ.. తాము ఇచ్చే డబ్బులు తీసుకునే వెబ్సైట్స్.. తన సినిమాను ఇలా తక్కువ చేసి రాయడం ఏంటో అంటూ ఆయన ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. సంవత్సరానికి 4,5 సినిమాలు ఇచ్చే తన పరిస్థితి ఇలా ఉంటే మామూలు వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అంటున్నాడు నాగ వంశీ. మన మీడియాలో ఇండియన్ 2 ఒకరు ఉన్నారని.. ఆయనకు ఏ సినిమా ఒక పట్టాన నచ్చదు.. అందుకే ప్రతి సినిమా గురించి తన వెబ్సైట్లో ఇష్టమొచ్చినట్టు రాస్తుంటాడు అని చెప్పాడు వంశీ. ఆయన పేరు చెప్పి అనవసరంగా తనను పెద్దవారిని చేయాలనుకోవట్లేదు అంటూ కామెంట్ చేశాడు ఈ నిర్మాత. మీకు నిజంగా అంత ధైర్యం ఉంటే నా సినిమాలు చూడకండి.. బ్యాన్ చేయండి.. నా సినిమాకు రివ్యూలు కూడా రాయొద్దు చూసుకుందాం అంటూ సవాల్ విసిరాడు. మేం ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ వెబ్సైట్స్ బతుకుతాయి.. మేము లేకపోతే మీరు లేరు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగ వంశీ. ఇది అందరినీ అనడం లేదని ఇండస్ట్రీలో ఉన్న కొన్ని వెబ్సైట్స్ ను మాత్రమే అంటున్నానంటే క్లారిటీ ఇచ్చాడు. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేసి ఎందుకు యూట్యూబ్, వెబ్సైట్స్ వెంటపడుతున్నారు అని అడిగితే.. తప్పక చేయాల్సి వస్తుంది.. అంతేగాని డబ్బులు పెట్టి సినిమాలో చూసిన నిర్మాత ఎవడి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదు అంటూ చెప్పాడు నాగవంశీ.

బాగా ఆడుతున్న సినిమాను కూడా చంపేయాలి అనుకోవడం శాడిజం కాకపోతే ఇంకేంటి అని ప్రశ్నించారు ఈయన. కచ్చితంగా ఇండస్ట్రీలో కొందరు తమ మీద బతుకుతూ.. తమ సినిమాలను చంపేయాలని ప్రయత్నిస్తున్నారని.. వాళ్లకు సినిమా నచ్చకపోతే ఎవరికి నచ్చకూడదు అని ఒక మెంటాలిటీతో ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ రాస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు నాగ వంశీ. మొత్తానికి మనోడు చాలా పెద్ద ఇష్యూ టచ్ చేశాడు. దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేయండి అని.. ఒక నిర్మాత ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో ఆయనను సతాయించి ఉంటారో అంటూ ఆడియన్స్ కూడా నాగ వంశీకే సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ మొదలైన ఈ అంశం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ ఈ బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రెట్రో మే 1న విడుదల కానుంది. మే 30న కింగ్ డమ్, జూలైలో మాస్ జాతర, ఆగస్టులో మ్యాజిక్ విడుదల కానున్నాయి. ఇలాంటి సమయంలో నాగవంశీ చేసిన కామెంట్స్ వాటిపై ఎఫెక్ట్ చూపిస్తాయా లేదా అనేది చూడాలి.