నిర్మాతలను భయపెడుతున్న పవన్… ఇప్పుడెలా…?
టాలీవుడ్ లో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా ఎలా ఉన్నా సరే ఫ్యాన్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ కాని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు సినిమా చేస్తే చాలు అని ఎదురు చూస్తూ ఉంటారు.

టాలీవుడ్ లో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమా ఎలా ఉన్నా సరే ఫ్యాన్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ కాని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అసలు సినిమా చేస్తే చాలు అని ఎదురు చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు సినిమా చేస్తారో, అసలు చేస్తారో చేయరో అనే క్లారిటీ ఉండదు. కథ ఎలా ఉన్నా సరే… పవన్ కనపడితే చాలు అనుకునే ఫ్యాన్స్ కు ఇప్పుడు వెయిటింగ్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ కోసం కథలు రాసుకుని… షూట్ కూడా ఫినిష్ చేసుకుని పవన్ తో సీన్స్ కోసం ఎదురు చూస్తున్నారు డైరెక్టర్ లు.
కాని పవన్ మాత్రం షూట్ విషయంలో అసలు క్లారిటీ ఇవ్వడం లేదనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వినపడుతోంది. పవన్ తో సినిమా చేస్తే నిర్మాతలకు కచ్చితంగా లాభమే. కాని ఆయన సినిమా చేయడమే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఆయనతో సినిమా కోసం పోటీ పడే నిర్మాతలు ఇప్పుడు భయపడుతున్నారు. 2020 లో హరిహర వీరమల్లు సినిమాకు పవన్ సైన్ చేసారు. ఆ సినిమా భారీ ప్రాజెక్ట్.
పవన్ మాత్రం ఇప్పటి వరకు షూట్ కంప్లీట్ చేయలేదు. రాజకీయాలతో, పాలనతో బిజీగా ఉండటంతో ఆయనకు షూట్ సాధ్యం కావడం లేదు. ఇప్పుడు మళ్ళీ షూట్ స్టార్ట్ చేసి, మళ్ళీ వేరే పనులతో బిజీ అయిపోయారు పవన్. ఆయన పరిస్థితి నిర్మాతలకు అర్ధమవుతున్నా… నిర్మాతల పరిస్థితే పవన్ కు అర్ధం కావడం లేదు. ఓజీ సినిమాను ఎలా అయినా వచ్చే ఏడాది నిర్మాతలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పుడో సినిమాకు పవన్ సైన్ చేసారు. కాని షూట్ మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాపైనే ఫోకస్ చేసాడు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో కూడా ఇంతే. సినిమా చేయడానికి సైన్ చేసి పవన్ బిజీ అయిపోతున్నారు. అందుకే ఇప్పుడు పవన్ కు అడ్వాన్స్ ఇచ్చి సినిమా స్టార్ట్ చేయాలనుకున్నా సరే నిర్మాతలు భయపడే పరిస్థితి. ఆయన చేస్తారో చేయరో తెలియక సైలెంట్ అయిపోతున్నారు. గట్టిగా అడగలేక… సినిమా వదులుకోలేక నిర్మాతలు అటు ఇటు కాని పరిస్థితిలో పడిపోయారు. వచ్చే ఏడాది వేసవిలో హరిహర వీరమల్లు, ఇయర్ ఎండ్ లో ఓజీ రిలీజ్ అని అంటున్నా… నమ్మకం లేదు దొరా…