పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో నిర్మాతలు కలెక్షన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. భారీగా కలెక్షన్స్ రావాలి అంటూ భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలను సెట్ చేస్తున్నారు. డైరెక్టర్ దగ్గర కథ పవర్ ఫుల్ గా ఉంటే చాలు ఎంతైనా సరే పెట్టుబడి పెట్టడానికి వెనకడుగు వేయడం లేదు. అంతవరకు బాగానే ఉంది. కానీ సినిమా వసూళ్ల విషయంలో చేస్తున్న హడావుడి మాత్రం అసలు ఏం బాగాలేదు అనే కామెంట్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమాలు కలెక్షన్స్ అన్నింటి పైన కూడా అభిమానుల్లో అనేక డౌట్స్ వస్తున్నాయి. పుష్ప సినిమా దాదాపు 2000 కోట్లు వసూలు చేసిందని మైత్రి మూవీ మేకర్స్ హడావిడి చేస్తోంది. నిజం చెప్పాలంటే ఆ లెక్కలు కరెక్ట్ కాదు అనే డౌట్ లు చాలామందికి ఉన్నాయి. రెండువేల కోట్లు వసూలు చేసే అంత స్టఫ్ పుష్ప సినిమాలో లేదు అనే క్లారిటీ అల్లు అర్జున్ అభిమానులకు కూడా ఉంది. సినిమాను రిపీటెడ్ ఆడియన్స్ చూస్తే మాత్రమే ఆ రేంజ్ లో వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఆక్యుపెన్సి రేటు పై డిపెండ్ అయి ఉంటుంది. ఆక్యుపెన్సీ రేట్ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత దారుణంగా పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు ఎక్కడా కూడా హడావుడి కనిపించలేదు. హిందీలో 900 కోట్లు వసూలు చేసిందంటూ హడావుడి చేయటం మొదలుపెట్టారు. ఆ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కనీసం 700 నుంచి 800 కోట్లు వసూలు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల విషయంలో నిర్మాతలు కూడా కరెక్ట్ అనౌన్స్మెంట్ ఇప్పటివరకు చేయలేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమాపై కూడా ఇలాగే అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా మొదటిరోజు ఏకంగా 1086 కోట్లు వసూలు చేసిందని సోషల్ మీడియాలో అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. హిందీలో ఈ సినిమాకు ఎక్కడా హడావిడి లేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ రేట్ నమోదు అవ్వటం కూడా కష్టంగానే కనబడింది. అలాంటిది 186 కోట్లు ఏ విధంగా వసూలు చేస్తుందని అది కూడా అట్టర్ ప్లాప్ టాక్ వచ్చిన తర్వాత... నార్మల్ ఆడియన్స్ వెళ్లకుండా మెగా అభిమానులు వెళితే మాత్రం ఆ రేంజ్ లో వసూలు వస్తాయా అంటూ మెగా అభిమానులే ట్రోల్ చేస్తున్నారు. రికార్డుల కోసం అనవసర ప్రకటనలు చేయొద్దని సినిమాలో పట్టు లేనప్పుడు ఈ అనౌన్స్మెంట్స్ తో.. అభిమానుల పరువు తీయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణను మెగా అభిమానులు కూడా పొగిడే పరిస్థితి ఉంది. ఆ సినిమా తొలి రోజు 56 కోట్లు వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే అది రీజనబుల్ అనే క్లారిటీ అందరికీ వచ్చింది.