ప్రాజెక్టు K లో ప్రభాస్ ప్యాంట్, షర్ట్ ధర 100 కోట్లు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే మేకింగ్ వీడియో వైరలైంది. ఇందులో విలన్స్ కోసం రెడీ చేసిన డ్రెస్ ని మాత్రమే చూపించారు. రైడర్స్ అంటూ విలన్స్ తాలూకు డ్రెస్ లని ఫిల్మ్ టీం రివీల్ చేసింది.ఐతే హీరో లుక్ ఎల ఉంటుందో పూర్తిగా ఇంతవరకు తేలలేదు.
ఏదో పోస్టర్ లో కిందపడిపోయిన ఓ వ్యక్తి చేయి, ఆ చేతికి ఉన్న భారీ గ్లౌజులు, వాటి రంగు బట్టి హీరో డ్రెస్ ని ఊహించుకోవాల్సిందే కాని, ఇంతవరకు హీరో లుక్ రివీల్ కాలేదు. సంక్రాంతికి రిలీజ్ కాబట్టి ఏడాది ముందే ఎందుకు రివీల్ చేయాలా అని ఫిల్మ్ టీం, ఎక్కడ హీరో లుక్ లీక్ కాకుండా చూసుకుంటోంది. కాని ఒక మ్యాటర్ మాత్రం లీకైంది
ప్రాజెక్ట్ కేలో ప్రభాస్ వేసుకునే డ్రెస్ 100 కోట్లు ఖర్చు చేసి రెడీ చేశారట. డ్రెస్ అంటే ఇది అలాంటి ఇలాంటి క్లాత్ తో రెడీ చేయలేదు. హాలీవుడ్ సూపర్ హీరోలు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, వండర్ వుమెన్ కు ఎలా అయితే ఓ డ్రెస్ కోడ్ ఉంటుందో, ఆ ఎలాస్టిక్ ఫ్యాబ్రిక్ తోనే ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ డ్రెస్ డిజైన్ చేశారట. ఇందులో మొత్తం పాలి ఫైబర్ ఫ్యాబ్రికే ఉంటుందట. పూర్తిగా స్కిన్ టైట్ గా ఉండే ఈ డ్రెస్ ని డిజైన్ చేసి, రెడీ చేసేందుకు 100 కోట్లు ఖర్చు వచ్చిందని తెలుస్తోంది. మిగతా ఆర్టిస్టుల డ్రెస్ మేకింగ్ ఖర్చు 50 కోట్లని తెలుస్తోంది.