ప్రభాస్ ఇంస్టా ప్రభాస్ ది కాదు, సలార్ విలన్ సెన్సేషనల్ కామెంట్స్
బాహుబలి సినిమా తర్వాత కంటే కల్కి సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు జనాల్లో తెలియని ఇంట్రెస్ట్ కనబడుతోంది
బాహుబలి సినిమా తర్వాత కంటే కల్కి సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు జనాల్లో తెలియని ఇంట్రెస్ట్ కనబడుతోంది. తెలుగు సినిమాలు పై ఇంట్రెస్ట్ చూపించని బాలీవుడ్ జనాలు, కూడా ఇప్పుడు తెలుగు నుంచి ఒక్క సినిమా వచ్చిన సరే ఎప్పుడు లేని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే, అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆ సినిమాకు థియేటర్లను భారీగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేతులో ఎనిమిది సినిమాలు ఉండటంతో, ఈ ఎనిమిది సినిమాలు మూడేళ్లలో రిలీజ్ కు రెడీ అవుతుండడంతో, బాలీవుడ్లో కంగారు మొదలైంది.
ఇక సౌత్ ఇండియాలో కూడా ప్రభాస్ మార్కెట్ సలార్ సినిమా తర్వాత భారీగా పెరిగింది. మలయాళంలో కూడా ప్రభాస్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల్లో నటించడానికి అక్కడి స్టార్ యాక్టర్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడు. సలార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. ఆ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించిన పృథ్వీరాజ్.. ప్రభాస్ పై అభిమానాన్ని పెంచుకున్నాడు. ప్రభాస్ బిహేవియర్, అలాగే ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో ఉండే విధానం అలాగే ఫుడ్ విషయంలో ప్రభాస్ చూపించే కేర్, ఇవన్నీ కూడా పృధ్విరాజ్ కు చాలా బాగా నచ్చేసాయి.
గతంలో కూడా పృథ్వీరాజ్.. ప్రభాస్ పై ఎన్నో సందర్భాల్లో ప్రశంసలు కురిపించాడు. లేటెస్ట్ గా కూడా ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు. ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడని.. స్టార్డం గురించి అసలు ఆలోచించడని చెప్పుకొచ్చాడు. ఇక సోషల్ మీడియా పై అసలు ఇంట్రెస్ట్ ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ పేరుతో ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి వచ్చే పోస్ట్లు షేర్ చేసేది ప్రభాస్ కాదన్నాడు. ఈ మాట చెప్పి మీ అందరిని నిరాశ పరిచినందుకు క్షమించాలంటూ రిక్వెస్ట్ చేశాడు.
అతడికి చిన్న చిన్న ఆనందాలంటే చాలా ఇష్టం అని, ఫామ్ హౌస్ లో చాలా సంతోషంగా ఉంటాడని పృథ్విరాజ్ బయటపెట్టాడు. ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అడుగుతూ ఉంటాడని, అంత పెద్ద స్టార్ అయినా అలాంటి చిన్న ఆనందాలను కోరుకోవడం చూసి తాను కూడా షాక్ అవుతాను అన్నాడు. ఇక ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ప్రస్తుతం 13 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. అలాంటి అకౌంట్ ప్రభాస్ వాడట్లేదు అని చెప్పడంతో జనాలు షాక్ అయ్యారు. ఇక రాజమౌళి పై కూడా పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాహుబలి తర్వాతనే హిట్ సినిమాలుకు సీక్వెల్స్ తీయడం మొదలైంది అన్నాడు. బాహుబలి కి ముందు కొన్ని సినిమాల సీక్వెల్స్ వచ్చినా.. ఆ రేంజ్ లో విజయం సాధించలేదు అన్నాడు.