Double iSmart: ఇస్మార్ట్ హీరోయిన్‌ని ఎందుకు దాచిపెడుతున్నారు..?
డబుల్ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి. కాకపోతే ఇందులో హీరోయిన్ ఎవరో ఇంతవరకు తేలలేదు. విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. కాని హీరోయిన్ పేరు కాని, ఫోటోకాని ఇప్పటివరకు వెల్లడికాలేదు.

Double iSmart: ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. విచిత్రం ఏంటంటే ఈ సినిమాని చాలా మంది పట్టించుకోవటం మానేశారు. కారణం మార్చిలో వస్తుందని ప్రకటించారు. కానీ, రాలేదు. ఆ తర్వాత ఎప్పడొస్తుందో తేలని పరిస్థితి. కాకపోతే యూత్‌కి బాగా నచ్చిన పాత్రలు, ఆ పాత్రలతో వచ్చే సీక్వెల్స్ ఎప్పుడైనా న్యూ క్లియర్ బాంబులా పేలొచ్చు. డీజే టిల్లూ పాత్ర జనాలకు ఎక్కింది కాబట్టి, దాని సీక్వెల్ టిల్లూ స్క్వేర్ వందకోట్లు రాబట్టింది.
Hardik Pandya: టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్.. పాండ్యాకు చోటు లేనట్టేనా ?
ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కూడా యూత్‌కి అలానే ఎక్కేసిన పాత్ర కాబట్టే డబుల్ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి. కాకపోతే ఇందులో హీరోయిన్ ఎవరో ఇంతవరకు తేలలేదు. విలన్‌గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. కాని హీరోయిన్ పేరు కాని, ఫోటోకాని ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఇస్మార్ట్ శంకర్‌లోనే ఇద్దరు హీరోయిన్లు యూత్ మతిపోగొడతితే, దాని సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్‌కి డబుల్ డోస్ కన్ఫామ్ అనుకున్నారు. తీరా చూస్తే డబుల్ డోస్ కాదు కదా.. కనీసం సింగిల్ హీరోయిన్‌కి దిక్కులేదు.
అసలు హీరోయినే లేదా, లేదంటే వరుడు మూవీలోలాగా రిలీజ్ వరకు హీరోయిన్‌ని చూపించకూడదని నిర్ణయించుకున్నారా..? ఇలా ఊరించి ఊరించి ఉత్తుత్తి హీరోయిన్‌ని తీసుకొస్తే మాత్రం సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ఉంది.