Puri Jagannath : గుర్తుపట్టలేనట్లుగా పూరీ జగన్నాథ్.. ఇలా అయ్యాడేంటి.. ఫ్యాన్స్ టెన్షన్..
ఇప్పుడంటే కెమెరాతో ఎలివేషన్స్ చూపిస్తున్నారు కానీ.. డైలాగులతోనూ హీరోను ఎలివేట్ చేయొచ్చని.. ఎలివేషన్‌కు కొత్త అర్థం చెప్పిన డైరెక్టర్ (director) పూరీ జగన్నాథ్ (Puri Jagannath). హీరో బేస్డ్‌గా కథలు రాసుకోవడంతో.. ఆ కథలను స్పీడ్‌గా కంప్లీట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా ! ఈ మధ్య ఆయన టైమ్ అస్సలు బాగున్నట్లు అనిపించడం లేదు. లైగర్ ఫ్లాప్ తర్వాత.. పూరీ కాస్త స్లో అయ్యాడు. తన ఇస్మార్ట్ బ్రెయిన్‌ను మరింత షార్ప్ చేశాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అంటున్నాడు.

Director Puri Jagannath has given a new meaning to elevation by saying that elevations can be elevated with dialogues
ఇప్పుడంటే కెమెరాతో ఎలివేషన్స్ చూపిస్తున్నారు కానీ.. డైలాగులతోనూ హీరోను ఎలివేట్ చేయొచ్చని.. ఎలివేషన్‌కు కొత్త అర్థం చెప్పిన డైరెక్టర్ (director) పూరీ జగన్నాథ్ (Puri Jagannath). హీరో బేస్డ్‌గా కథలు రాసుకోవడంతో.. ఆ కథలను స్పీడ్‌గా కంప్లీట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా ! ఈ మధ్య ఆయన టైమ్ అస్సలు బాగున్నట్లు అనిపించడం లేదు. లైగర్ ఫ్లాప్ తర్వాత.. పూరీ కాస్త స్లో అయ్యాడు. తన ఇస్మార్ట్ బ్రెయిన్‌ను మరింత షార్ప్ చేశాడు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అంటున్నాడు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులు జరుపుకుంటోంది. డబుల్ ఇస్మార్ట్ ( Smart-2) మీద పూరీ జగన్నాథ్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. అటు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటే పూరీ జగన్నాథ్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు. లేటెస్ట్‌గా తన ఫోటో ఒకటి షేర్ చేశారు పూరీ. ఈ ఫోటోలో గుర్తు పట్టలేనంతగా పూరీ మారిపోయాడు. గుండు లుక్‌లో ఈయన ఫోటో చూస్తే.. ఎవరైనా సరే పూరీకి ఏమైంది, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉందా అనే అనుమానం రాకుండా ఉండదు. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఇదే టెన్షన్ పడుతున్నారు.
ఐతే క్యాప్షన్ చదివాక.. ఆ టెన్షన్ కాస్త తీరిపోతోంది. ఉదయించే సూర్యుడు అంటూ ఫోటోకి క్యాప్షన్ పెట్టాడు పూరీ. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐతే పాజిటివ్స్ వైబ్స్ కనిపిస్తున్నాయని.. ఓ భారీ సెట్‌లో డబుల్ ఇస్మార్ట్ షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయని.. 2024 మార్చి 8 థియేటర్లలో కలుసుకుందాం అని ఆ ఫోటో మీద రాసుకొచ్చాడు పూరీ. ఇక అటు తనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని.. బాగానే ఉన్నానని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరిపీల్చుకున్నారు.