Pushpa 2 : పుష్ప 2.. ఈసారి రొమాంటిక్ టచ్

పుష్ప.. పుష్ప.. అంటూ, ఫస్ట్ సాంగ్‌లో పుష్పరాజ్ (Pushpa Raj) క్యారెక్టర్‌కు ఓ రేంజ్‌ ఎలివేషన్ ఇచ్చాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ (Devishri Prasad) క్యాచీ ట్యూన్ అదిరిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 11, 2024 | 12:00 PMLast Updated on: May 11, 2024 | 12:00 PM

Pushpa 2 A Romantic Touch This Time

 

 

 

పుష్ప.. పుష్ప.. అంటూ, ఫస్ట్ సాంగ్‌లో పుష్పరాజ్ (Pushpa Raj) క్యారెక్టర్‌కు ఓ రేంజ్‌ ఎలివేషన్ ఇచ్చాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ (Devishri Prasad) క్యాచీ ట్యూన్ అదిరిపోయింది. ఇక పుష్పగాడి స్టెప్పులకు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. షూ డ్రాప్ స్టెప్, ఛాయ్ స్టెప్ సాంగ్‌లో హైలెట్‌గా నిలిచింది. ఈ సాంగ్‌ను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు బెంగాళీ భాషల్లో విడుదల చేసారు. ప్రస్తుతం ఈ సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. మొత్తంగా.. ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. దీంతో పుష్ప2 సెకండ్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

జూన్ నెలలో పుష్ప2 నుంచి మరో పాటకు రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే.. ఫస్ట్ సాంగ్‌లో పుష్పరాజ్‌కు ఎలివేషన్‌ ఇవ్వగా.. సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ రెండో పాట ఓ రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నాపై వచ్చే ఈ రొమాంటిక్‌ సాంగ్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఈ లెక్కన ఈ సాంగ్‌తో బన్నీ ఫ్యాన్స్ కొన్ని రోజులు రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోవాల్సిందే.

ఇకపోతే.. సుకుమార్ (Sukumar) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై హిందీలో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా పుష్ప2 (Pushpa 2) విడుదల కానుంది. ఖచ్చితంగా పుష్ప 2 వెయ్యి కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి పుష్పరాజ్ ఈసారి ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.అన్నట్టు ఈ సినిమాను కర్ణాటకలో N సినిమాస్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు మేకర్స్.