పుష్ప 2 BGM మొత్తం నాదే, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ ఇండియా నుంచి మొదలుపెట్టి సౌత్ ఇండియా వరకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రేంజ్ లో నార్త్ లో ఈ సినిమా హవా నడుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ ఇండియా నుంచి మొదలుపెట్టి సౌత్ ఇండియా వరకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రేంజ్ లో నార్త్ లో ఈ సినిమా హవా నడుస్తోంది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు కూడా ఈ సినిమా స్పీడ్ చూసి షాక్ అవుతున్నారు. గతంలో ఏ ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో విడుదల కాలేదు. ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేశారు మైత్రి మూవీ మేకర్స్.
మన తెలుగులో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో కథ లేకపోయినా ఎలివేషన్స్ సీన్స్ తో పాటుగా యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని… అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం సినిమాను ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అంటే కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాతర చాలా హైలెట్ గా నిలిచింది అంటూ సినిమా చూసినవాళ్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన రీల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. రీసెంట్ టైమ్స్ లో ది బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఎలివేషన్ సీన్స్ తో పాటుగా సాంగ్స్ లో కూడా మ్యూజిక్ పై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. థియేటర్లు బద్దలవుతున్నాయంటూ హార్ట్ పేషెంట్లు సినిమాకెళ్ల వద్దంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎలివేషన్స్ సీన్స్ లో అయితే థియేటర్లో కుర్చీలు షేక్ అయ్యాయి. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ శ్యాం సియస్ రియాక్ట్ అయ్యాడు.
పుష్ప 2 సినిమాకు దాదాపు 90% బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తానే ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చాడు. తాను స్క్రిప్ట్ చదవకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సినిమా ఇది ఒక్కటే అంటూ చెప్పుకొచ్చాడు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఎడిటింగ్ అయిపోగానే తనను సంప్రదించారని, మొత్తం సినిమాకు పని చేశానని కొన్ని చోట్ల దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఉంచారని, క్లైమాక్స్ ఫైట్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తనదే అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్ చేసినా అతని మ్యూజిక్ వాడలేదు. దీనిపై తమన్ సీరియస్ అయ్యాడు. దేవిశ్రీప్రసాద్ తో వచ్చిన విభేదాల కారణంగానే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను సినిమా కోసం తీసుకున్నారంటూ కామెంట్స్ వచ్చాయి.