Pushpa 2: పుష్ప రచ్చ.. సింహంతో సుకుమార్

ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి ఆగస్ట్ 15న పుష్ప2ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా.. పుష్ప సెట్‌ నుంచి ఒక పవర్ ఫుల్ పిక్‌ను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 12:49 PMLast Updated on: Feb 13, 2024 | 12:49 PM

Pushpa 2 Director Sukumar Photo With Lion Goes Viral On Social Media

Pushpa 2: తెలుగులో ఓ మోస్తారుగా నిలిచిన పుష్ప పార్ట్ వన్.. హిందీ బెల్ట్‌లో మాత్రం సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్‌ను అంతకు మించి అనేలా డిజైన్ చేశాడు సుకుమార్. స్క్రిప్టు కోసమే ఏడాదికి పైగా సమయం తీసుకున్న సుక్కు.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా పుష్ప2ని చాలా గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వేర్ ఈజ్ పుష్ప అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాడు.

CM Revanth Medigadda Tour : నువ్వొస్తానంటే హెలికాప్టర్ పెడతా… కేసీఆర్ కు రేవంత్ ఆఫర్ !

అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం.. అంటూ ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. పుష్పరాజ్‌ను పులితో ఎలివేషన్ ఇచ్చిన సుకుమార్.. ఇప్పుడు సింహంతో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి ఆగస్ట్ 15న పుష్ప2ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్‌గా.. పుష్ప సెట్‌ నుంచి ఒక పవర్ ఫుల్ పిక్‌ను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్‌లో సింహం విగ్రహం పై కాస్త ఒరిగి కూల్‌గా కనిపిస్తున్నాడు సుకుమార్. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహంతో సుకుమార్ ఫోటో మామూలుగా లేదని అంటున్నారు.

పుష్ప ది రైజ్‌‌లో సమంత హాట్ హాట్‌ స్టెప్పులతో ఊ అంటావా సాంగ్‌ ఇండస్ట్రీని ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు పుష్ప.. ది రూల్‌ నుంచి మరో అదిరిపోయే ఐటంసాంగ్‌ రాబోతుంది. సీక్వెల్‌లో వచ్చే ఈ పాట లో బాలీవుడ్ భామ దిశాపటానీ చిందులు వేయనున్నట్లు తెలుస్తోంది.ఈ సాంగ్‌ను రామోజీఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారట. మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పుష్ప రాజ్ మళ్లీ వస్తున్నాడు. చూడాలి మరీ ఈ సారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.