దేవరని మించిపోతుందన్నారు.. కాని ట్రోలింగ్ మాత్రమే మించిపోతోందా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీనే పుష్ప 2 మించిపోతుందన్నారు. రిలీజ్ కిముందే 1000 కోట్ల బిజినెస్ చేసిందని కూడా ప్రచారం పెంచారు. కాని దేవరని వసూళ్ల విషయంలో మించుతుందో లేదో కాని, ఒక విషయంలో మాత్రం దేవరని సౌత్ లో నే కాదు,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 25, 2024 | 05:58 PMLast Updated on: Nov 25, 2024 | 5:58 PM

Pushpa 2 Got Huge Trolls On Social Media

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీనే పుష్ప 2 మించిపోతుందన్నారు. రిలీజ్ కిముందే 1000 కోట్ల బిజినెస్ చేసిందని కూడా ప్రచారం పెంచారు. కాని దేవరని వసూళ్ల విషయంలో మించుతుందో లేదో కాని, ఒక విషయంలో మాత్రం దేవరని సౌత్ లో నే కాదు, నార్త్ లోకూడా మించిపోతోంది పుష్ప 2 మూవీ. అదే భారీ ట్రోలింగ్ లో దేవరనేమించిపోయింది పుష్ప 2 మూవీ. నార్త్ మీడియాలో పుష్ప2 మీద భారీ ట్రోలింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో కూడా కామెంట్ల దాడి భారీ గా జరుగుతోంది. విచిత్రం ఏంటంటే సౌత్ లో టాప్ స్టార్స్ ఫ్యాన్స్ ఆల్రెడీ పుష్ప2 మీద ట్రోలింగ్ పెంచారు. ఇప్పుడు బాలీవుడ్ మీడియా కూడా పుష్పరాజ్ నిజంగా ఫైరేనా అంటోంది. సౌత్ హీరో నార్త్ కొస్తే ఏదోలా ట్రోల్ చేయాలనుకునే బ్యాచ్ కి పుష్ప 2 మూవీ టార్గెట్ అయ్యింది. నార్త్ లో దేవరని వసూల్లతో మించిపోతుందనేంత ప్రచారం జరుగుతోంది కాని, జరుగుతున్న ట్రోలింగ్ పరంగా మాత్రం దేవరని మించిపోయింది పుష్ప2.

దేవర మూవీ సౌత్ తో పోలిస్తే నార్త్ లో నే ఎక్కువగా దుమ్ముదులిపింది. ఐతే పుష్ప2 తో ఊర మాస్ జాతనే అంటూ బన్నీ అండ్ కో భారీగానే ప్రచారం చేస్తున్నారు. దేవరని మించేలా మాస్ పూనకాలు ఉంటాయంటున్నారు. కాని దేవరని ఏ విషయంలో మించినా మించకపోయినా, ఒకవిషయంలో మాత్రం పుష్ప 2 మూవీ దేవరని మించిపోయింది

అదే ట్రోలింగ్ లో… పుష్ప2 మీద సడన్ గా నార్త్ ఇండియన్ మీడియా,మరీ ముఖ్యంగా బాలీవుడ్ మీడియా ఊహించని రేంజ్ లో కామెంట్ల దాడి చేస్తోంది. పుష్ప2 మూవీ డిసెంబర్ 5 కి రిలీజ్ అవ్వటం ఆల్ మోస్ట్ అసాధ్యమని, డిసెంబర్ ఎండ్ కి లేదంటే జనవరే గతంటూ మీమ్స్ పెరిగాయి

ఇలా దేవరని మించేలా పుష్ఫ 2 మీద ట్రోలింగ్ పెరగటానికి రీజన్, సౌత్ హీరోల డామినేషన్ నార్త్ మార్కెట్ మీద భారీగా ఉండటం బాలీవుడ్ లో ఒక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఆల్రెడీ దేవర మీద ఆ కోపాన్నే ప్రదర్శిస్తే, ఊరమాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ ఈజీగా దేవర మూవీతో నార్త్ మార్కెట్ ని ఊపేశాడు

కాని పుష్ప2 కి బాలీవుడ్ మీడియానే కాదు,సౌత్ లోకూడా ట్రోలింగ్ తప్పట్లేదు. ఆల్రెడీ ఎన్టీఆర్ దేవరతో పుష్ప2 ని పోల్చటం, 6700 థియేటర్స్ లో దేవర వస్తే, 11500 థియేటర్స్ లో పుష్ప2 ని రిలీజ్ చేయాలనుకోవటం, ఇవన్నీ దేవర కంటే పుష్ప రాజ్ ఏవిషయంలో తగ్గడనిచూపించుకోవటమే అంటున్నారు

ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకతని మూటకట్టుకున్నపుష్ప2 టీం మీద, ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఫైర్ అవుతున్నారు. కారణం ఏపీ పాలిటిక్స్ లో బన్నీ రాంగ్ పర్సన్ వైపుండటమే అన్నారు. అది టీడీపీ, జనసేన కార్యకర్తలను ఫైర్ అయ్యేలా చేసింది. ఇక మహేశ్ ఫ్యాన్స్ , ఎన్టీఆర్ ఫ్యాన్స, మెగా ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ ఇలా అంతా పుష్ప 2 మీద ఫైర్ అవుతున్న టైంలో బాలీవుడ్ మీడియా ఇలా పుష్ప 2 రిలీజ్ వాయిదా పడుతుందంటూ, నెగెటీవ్ ప్రచారం చేయటం నిజంగా మెరుపుదాడే

ఈ ఆదివారంలోగా పెండింగ్ సాంగ్ షూటింగ్ పూర్తౌతోంది. ఈనెల 28 వరకు మిగతా ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తవ్వాలి.అంటే పుష్ప రిలీజ్ డేకి 6 రోజుల ముందు వరకు షూటింగ్ జరుగుతూనే ఉంటే, ఇక డిసెంబర్ 5కి సినిమా వస్తుందా? ఎలా వస్తుందంటూ బీటౌన్ లో కొన్ని మీడియా సంస్థలు డౌట్లనే కామెంట్లు గా మార్చేశాయి. రియాలిటీకి దగ్గరగా ఉన్న కామెంట్స్ అవటం వల్ల వీటితో పుష్ప 2 మీద జరిగే నెగెటీవ్ ప్రచారానికి రీచ్ పెరుగుతోంది.