1409 కోట్ల రికార్డు ఉన్నా, ఆ హైప్ లేదు… ఈ లెక్కల మీద నమ్మకం లేదా..?

పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే 1409 కోట్లు రాబట్టిందన్నారు. ప్రొడ్యూసర్లు పోస్టర్ వదిలారు. యూఎస్ లో అయితే ఏకంగా 11 రోజుల్లోనే13 మిలియన్ డాలర్ల వసూళ్లన్నారు. అది కూడా పోస్టర్ రూపంలో సోషల్ మీడియాలో వైరలైంది. కట్ చేస్తే ఇదే మూవీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో డిజాస్టర్ గా తేలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2024 | 02:59 PMLast Updated on: Dec 18, 2024 | 2:59 PM

Pushpa 2 Has Earned 1409 Crores Worldwide In 11 Days

పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే 1409 కోట్లు రాబట్టిందన్నారు. ప్రొడ్యూసర్లు పోస్టర్ వదిలారు. యూఎస్ లో అయితే ఏకంగా 11 రోజుల్లోనే13 మిలియన్ డాలర్ల వసూళ్లన్నారు. అది కూడా పోస్టర్ రూపంలో సోషల్ మీడియాలో వైరలైంది. కట్ చేస్తే ఇదే మూవీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో డిజాస్టర్ గా తేలింది. మళ్లూ వుడ్ లో అల్లు అర్జున్ కాదు మల్లూ అర్జున్ అనేంతగా అక్కడ తనకి క్రేజ్ ఉంది…అలాంటి మార్కెట్ లో పుష్ప 2 ఫ్లాప్ కాదు డిజాస్టర్ అనేస్తున్నారు. తెలుగు వర్షన్ 60 శాతం పైనే వసూళ్లు డ్రాప్ అయ్యాయన్నారు. కన్నడ, తమిళ్ మార్కెట్లో పుష్ప2 కి మొదట్నుంచి పెద్దగా ఊపు లేదు.. ఇక మిగిలింది బాలీవుడ్ మార్కెట్టే… అక్కడ వస్తున్న వసూళ్లే పుష్ప2 ని థౌజెండ్ వాలాగా మార్చాయన్నారు. కాని ఎన్నడూ లేంది నార్త్ ఇండియాలో కూడా కొత్తగా పుష్ప2 మీద కామెంట్ల దాడి పెరిగింది. 1409 కోట్లు వసూళ్లు కేవలం 11 రోజుల్లో రాబట్టిందంటేనే చాలా మందికి ఈ లెక్కల మీద డౌట్లొస్తున్నాయనే చర్చమొదలైంది. అంతగా వసూల్లు రాబట్టినా, బయటెందుకు ఆరేంజ్ లో హైప్ లేదన్న డౌట్లు షురూ అయ్యాయి. ఇలాంటి టైంలోనార్త్ ఆడియన్స్ నుంచి సోషల్ మీడియాల చిత్ర విచిత్రమైన కామెంట్లు, డౌట్లు అది కూడా తన అరెస్ట్, తర్వాత బేయిల్ ఎపిసోడ్ తోనే మొదలైంది…

ఇండియాలో ఎన్నడూ జరగంది జరితే మొత్తం 140 కోట్ల మంది చూపు అటువైపే ఉంటుంది.. మరి 11 రోజుల్లో 1409 కోట్లు ఒక సినిమా రాబడితే ఎంత సెన్సేషన్ అవ్వాలి… పుష్ప2 కి అలానే 11 రోజుల్లో 1409 కోట్లొచ్చాయంటే, త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2, కల్కీ , జవాన్, పటాన్ రికార్డులన్నీంటినీ ఈ సినిమా వెనక్కి నెట్టినట్టే..

కాని జనాల్లో మాత్రం మిగతా హిట్లకు వచ్చినంత పూనకాలు, మార్కెట్ లో వైబ్రేషన్స్ పుష్ప2 కి కనిపించట్లేదు. అలాని వస్తున్న వసూల్లు అబద్దం అనలేం. కాని ఎనౌన్స్ చేస్తున్న నెంబర్స్ ని మాత్రం డౌట్ గా చూడకుండా ఉండట్లేదు..

దానికి సాలిడ్ రీజనుంది… తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు నుంచే పుష్ప 2 వసూల్లలో 60శాతానికి పైనే డ్రాప్ కనిపించాయి. మల్లూ అల్లూ అనేంతగా మాలీవుడ్ లో తనకి ఇమేజ్ ఉన్నా అక్కడ ఈ సినిమా రోజుకి లక్షల్లోనే రాబట్టి, డిజాస్టర్ గా తేలిపోయిందంటున్నారు. కన్నడ, తమిళ మార్కెట్ లో పుష్పరాజ్ కి పెద్దగా టిక్కెట్లు తెగట్లేదు.. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే 60శాతం వసూళ్లడ్రాప్ అయినా, అంతో ఇంతో టాలీవుడ్ లోనే పుష్ప 2 పరిస్థితి కాస్త బెటర్ ..

ఎటొచ్చి నార్త్ ఇండియాలోనే వసూళ్ల వరద ఉండటంతో ఈ సినిమా కలిసొస్తుంది… కాని అక్కడ కూడా పుష్ప2 మీద డౌట్ల తాలూకు కామెంట్లు పేలాయి. ఇది ఆల్ మోస్ట్ ఫస్ట్ టైం … 1000 కోట్ల క్లబ్ లో పుష్ 2 చేరాకే వసూల్లు డ్రాప్ అయ్యాయి… అప్పుడే బన్నీ అరెస్ట్, తర్వాత బేయిల్ తర్వాత సడన్ గా వసూళ్లు పెరగటం మొదలయ్యాయి..

వాటినే నిర్మాతలు ఎనౌన్స్ చేస్తూ వస్తున్నారు.. ఈ ఎపిసోడ్ అంతా చూసి బన్నీ అరెస్ట్, బేయిల్ అంతా పబ్లిసిటీ స్టంటేనా అంటున్నారు. తగ్గనన్న పుష్పరాజ్ తగ్గగానే తనని పెంచేందుకు ఈ అరెస్ట్ ఎపిసోడ్ ని వాడారంటూ మరో కామెంట్.. ఇలా హిందీ జనాలనుంచి సోషల్ మీడియాలో కామెంట్లు పెరగటంతో, పుష్ప2 వసూళ్ల మీద డౌట్లు సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా పెరిగాయనే మాట వినిపిస్తోంది.

పుష్ప2 వసూళ్ల మీద డౌట్లు రావటానికి రీజన్, మార్కెట్ లో పుష్ప2 హిట్ అని ఎంతమంది అన్నా, మరీ 11 రోజుల్లో 1409 కోట్ల వసూళ్లొచ్చేంత సెన్సేషనల్ వైబ్రేషన్స్ లేవనే టాకే రావటం… దీనికి తోడు మెగా గ్యాప్, జనసైనికుల నుంచి టీడీపీ బ్యాచ్ వరకు చాలా మందికి బన్నీ వ్యవహారం నచ్చక అక్కడ నుంచి వ్యతిరేకత పెరగటం… ఆతర్వాత నిజంగానే పుష్ఫ 2 సెకండ్ హాఫ్ సోసోగా ఉందనే మాటే తూటాలా పేలటం ఇలా చాలా కారణాలతో పుష్ప2 వసూళ్ల మీద డౌట్ల కామెంట్లు తూటాల్లా పేలుతూనే ఉన్నాయి.