Pushpa2 : నైజాంలో “పుష్ప 2” హవా..

పుష్ప 2 (Pushpa 2) టీజర్‌తో పుష్పరాజ్ (Pushparaj) దమ్మేంటే తేలిపోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపడం ఖాయమని ఇండస్ట్రీ ఫిక్సయిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2024 | 10:56 AMLast Updated on: Apr 10, 2024 | 10:56 AM

Pushpa 2 Hawa In Naijam

పుష్ప 2 (Pushpa 2) టీజర్‌తో పుష్పరాజ్ (Pushparaj) దమ్మేంటే తేలిపోయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపడం ఖాయమని ఇండస్ట్రీ ఫిక్సయిపోయింది. టీజర్‌ దుమ్ము దులపడంతో సినిమాపై ఉన్న అంచనాలు కాస్తా ఆకాశం హద్దుగా చెలరేగిపోయాయి. అర్ధనారీశ్వర రూపంలో బన్నీ పవర్‌ఫుల్ యాక్టింగ్‌ కోసం పాన్ ఇండియా (Pan India) ఫ్యాన్స్ యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు. దీంతో.. పుష్ప-2 బిజినెస్ లెక్కలు అంచనాలకు అందడం లేదు.. ఇప్పటికే ఈ మూవీపై ఉన్న క్రేజీ బజ్ గ్రాఫ్‌ కాస్తా మరింతగా దూసుకుపోతోంది. ఇప్పుడు “పుష్ప 2” కి సెన్సేషనల్ బిజినెస్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌కి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పుష్ప 2 మూవీకి వెయ్యి కోట్లు పక్కా కోట్లు పక్కా అని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేసేశాయి. ఈ టార్గెట్‌ని రీచ్ అయ్యేలా దర్శకుడు సుకుమార్ (Sukumar) కూడా చాలా గట్టిగా కష్టపడుతున్నట్టు టీజర్ చూస్తేనే అర్థమైపోతోంది. అయితే ఇప్పుడు నైజాం ఏరియాకి సంబంధించి సెన్సేషనల్ ఆఫర్ పుష్ప 2 కి వచ్చినట్టుగా ఓ లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఒక్క నైజాం నుంచే ఈ సినిమాకి వంద కోట్లకి పైగా బిజినెస్ ఆఫర్ ఉన్నట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. దీనితో పుష్ప 2 హవా ఏ లెవెల్లో ఉందా అంటూ సిని వర్గాలతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నైజాంకి సంబంధించే పరిస్థితి ఈ రేంజ్‌లో ఉంటే.. టోటల్ బిజినెస్ సంబంధించిన డిటెయిల్స్ వస్తే మైండ్ బ్లాంక్ కావడం ఖాయమంటున్నారు.

పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ ఇండియాలో అతిపెద్ద స్టార్ గా అవతరిస్తాడని కూడా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పుష్ప 2 సులువుగా 100 కోట్ల ఓపెనింగ్ సాధిస్తుందంటున్నారు. ప్రస్తుతం పుష్ప 2కి ఉన్న హైప్ నేపథ్యంలో కేవలం హిందీలోనే ఈ సినిమాకు 40 నుంచి 50 కోట్ల ఓపెనింగ్ వస్తుందంటున్నారు. కాగా.. అల్లు అర్జున్ బర్త్‌డే కానుకగా రిలీజైన టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తొలి 24 గంటల్లోనే 4 కోట్లకుపైగా రికార్డు వ్యూస్‌ను సాధించింది. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న పుష్ప-2 మరెన్ని రికార్డులను బద్దులు కొట్టనుందో చూడాల్సిందే.