Pushpa2 : పుష్ప‌-2 ఇంట‌ర్వెల్ సీన్ లీక్

పాన్ ఇండియా (Pan India) మూవీ పుష్ప-2కోసం అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులతో పాటు.. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్-1 కంట్రీ వైడ్‌గా దుమ్ము రేప‌డంతో.. పుష్ప‌-2 (Pushpa2) పై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి త‌గ్గ‌ట్లుగానే ఎక్కడా తగ్గేదే లే అంటూ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2024 | 10:00 AMLast Updated on: Feb 23, 2024 | 10:00 AM

Pushpa 2 Interval Scene Leaked

 

 

 

పాన్ ఇండియా (Pan India) మూవీ పుష్ప-2కోసం అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులతో పాటు.. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్-1 కంట్రీ వైడ్‌గా దుమ్ము రేప‌డంతో.. పుష్ప‌-2 (Pushpa2) పై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి త‌గ్గ‌ట్లుగానే ఎక్కడా తగ్గేదే లే అంటూ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక‌.. పుష్ఫ సినిమాతో ఎన్నో ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు కలగా మిగిలిన నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుని కూడా తీసుకొచ్చాడు బన్నీ.. దీంతో..అల్లు వారి అబ్బాయి క్రేజ్ హైస్కైగా పెరిగిపోయింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

తాజాగా పుష్ఫ‌-2 ఇంటర్వెల్ ఎపిసోడ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పుష్ప 2 మొదటి పార్ట్ కంటే గ్రాండ్ గా ఉంటుందని.. డ్రామా సీన్స్ కూడా చాలా ఉంటాయని ఇప్ప‌టికే మూవీ టీం ప‌దే ప‌దే చెప్తూ వస్తోంది. పుష్ప‌-1 ని మించి పుష్ప‌-2 ఉండబోతోంద‌న్న వార్త‌లు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలోని ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ కి సంబంధించిన ఓ వార్త గూస్ బంప్స్ తెప్పిస్తోంది. రెగ్యులర్ గా పెద్ద సినిమాల్లో మంచి యాక్షన్ ఎపిసోడ్ తో ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఉంటాయి, అయితే అందుకు భిన్నంగా హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సాంగ్ తో పుష్ప 2 మూవీలో ఇంటర్వెల్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట సుకుమార్.. ఇది గుండెలు పిండేసే ఫీల్‌ను కలిగిస్తుందని ఓ టాక్ వినిస్తోంది.. గతంలో ఏ మాస్ మూవీలోనూ ఇలాంటి సీన్ పెట్టలేదని.. ఈ సీన్ పుష్ప‌-2 ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్తుంద‌ని చెబుతున్నారు.

కాగా ఈ మూవీని ఆగష్టు 15న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ – సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప ద రూల్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.. కాగా.. పుష్ప‌-1 త‌ర‌హాలోనే పుష్ప‌-2 నుంచి కూడా డీఎస్పీ నుంచి మ్యూజిక‌ల్ మ్యాజిక్‌ను ఆశిస్తున్నారు ఫ్యాన్స్