Pushpa2 : నైజాంలో దిమ్మతిరిగే బిజినెస్
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న చిత్రాలలో 'పుష్ప 2' (Pushpa 2) ఒకటి. పాజిటివ్ టాక్ వస్తే.. వసూళ్ల పరంగా ఇప్పటివరకు ఇండియాలో ఉన్న రికార్డులన్నీ తిరగరాస్తుందనే అంచనాలున్నాయి.

'Pushpa 2' is one of the highly anticipated films across the country. If you get positive talk..
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న చిత్రాలలో ‘పుష్ప 2’ (Pushpa 2) ఒకటి. పాజిటివ్ టాక్ వస్తే.. వసూళ్ల పరంగా ఇప్పటివరకు ఇండియాలో ఉన్న రికార్డులన్నీ తిరగరాస్తుందనే అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘పుష్ప 2’ చిత్రానికి కళ్ళు చెదిరే బిజినెస్ జరుగుతోంది.
‘పుష్ప 2’ మూవీకి ఒక్క నైజాం ఏరియాలోనే (Nizam Area) 100 కోట్ల బిజినెస్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా నైజాంలో ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం మాత్రమే 100 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. అలాంటిది ‘పుష్ప 2’కి వంద కోట్ల బిజినెస్ ఆఫర్ వచ్చిందనే వార్త సంచలనంగా మారింది. ఈ లెక్కన థియేట్రికల్ బిజినెస్ తోనే ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించేలా ఉంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప 2’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది