Pushpa 2: పుష్ప 2.. ఒక్క పోస్టర్‌తో బయట పడ్డ ఎన్నో నిజాలు..!

పుష్ప రాజ్ చేతి వేళ్లకు ఉంగరాలు, మణికట్టుకి బ్రేస్‌లెట్‌లు ఉన్నాయి. అంతా బానే ఉంది. కాని చేతికి రక్తపు మరకలు, చిటికెన వేలుకి గోరు దానికి నేయిల్ పేయింట్ ఉంది. దాన్ని బట్టి చూస్తే పుష్ప 2లో రష్మిక చనిపోతుందనే పుకారే నిజమనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2023 | 06:20 PMLast Updated on: Sep 12, 2023 | 6:20 PM

Pushpa 2 Makers Gave Hint About Rashmika Mandanna Character With Poster

pushpa 2: పుష్ప 2 పోస్టర్ రిలీజ్ అయ్యాకే రకరకాల ప్రిడిక్షన్స్ పెరిగాయి. పుష్ప రాజ్ చేతి వేళ్లకు ఉంగరాలు, మణికట్టుకి బ్రేస్‌లెట్‌లు ఉన్నాయి. అంతా బానే ఉంది. కాని చేతికి రక్తపు మరకలు, చిటికెన వేలుకి గోరు దానికి నేయిల్ పేయింట్ ఉంది. దాన్ని బట్టి చూస్తే పుష్ప 2లో రష్మిక చనిపోతుందనే పుకారే నిజమనిపిస్తోంది. బేసిగ్గా చిటికన వేలుతో వైఫ్ వేలిని పట్టుకుని ఏడడుగులు వేయటం సంప్రదాయం. కాబట్టి ఆ వేలు వైఫ్‌ని సూచిస్తుంది.

అలానే అబ్బాయిలు అలా ఒకే వేలుకి గోరు పెంచి పేయింట్ వేసుకోవటం సాధారణంగా జరగదు. కాని స్పెసిఫిక్‌గా పుష్ప రాజ్ వేలి గోరుకి పేయింట్ ఉందంటే, ఆ చేతికే రక్తం మరక అంటిందంటే, ఖచ్చితంగా తన వైఫ్‌ని చంపిన వ్యక్తిని చంపే రివేంజ్ ప్రాసెస్‌లోనే ఆ రక్తం మరక అంటిందా..? దాన్నే ఆ పోస్టర్‌తో చెప్పకనే సుకుమార్ చెప్పాడా.. అన్న అనుమానాలు పెరిగాయి. ఇంకో థియరీ ప్రకారం తన తల్లి నుదుటి బొట్టుని రెడ్ కలర్‌తో పోల్చి పుష్ప రాజ్ చేతి వేలికి అలా గోరుని పెంచి పేయింట్ వేసుకున్నాడని, కాబట్టి తన తల్లిపాత్ర ఇందులో చనిపోయి సినిమాకు రివేంజ్ కంటెంట్‌గా మారుతుందనే మరో ప్రెడిక్షన్ కూడా జరుగుతోంది.