రష్మికను కోర్ట్ కు లాగారు, పుష్పను వెంటాడుతున్న హైకోర్ట్ లు
ఓ వైపు విడుదలకు సిద్దమవుతున్న పుష్ప 2 సినిమాకు ఇప్పుడు కోర్ట్ ల నుంచి సమస్యలు తప్పేలా కనపడటం లేదు. పుష్ప టికెట్ల రేట్లు పెంచడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం చూస్తూనే ఉన్నాం.
ఓ వైపు విడుదలకు సిద్దమవుతున్న పుష్ప 2 సినిమాకు ఇప్పుడు కోర్ట్ ల నుంచి సమస్యలు తప్పేలా కనపడటం లేదు. పుష్ప టికెట్ల రేట్లు పెంచడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్స్ కూడా టికెట్ రేట్స్ పై సీరియస్ గా ఉన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో కోర్ట్ సమస్యలు పుష్ప సినిమాను వెంటాడుతున్నాయి. తెలంగాణా హైకోర్ట్ లో దాఖలు అయిన పిటీషన్ పై విచారణ జరిగి కోర్ట్ 2 వారాలకు విచారణ వాయిదా వేసింది.
అయితే ఆ పిటీషన్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పిటీషన్ లో ప్రస్తావించిన అంశాలు పుష్ప మేకర్స్ ను కలవరపెడుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమల్ పుష్ప 2 సినిమాపై పిటీషన్ దాఖలు చేసారు. బెనిఫిట్ షో… సినిమా నిర్మాతలకు బెనిఫిట్ చేసేది మాత్రమే అని ఆయన కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు. టిక్కెట్ రేట్లు ఇష్టానుసారం పెంచడం సరైంది కాదని ఆయన కోర్ట్ ముందు పలు అంశాలను ప్రస్తావించారు. రేట్ల పెంపు పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మెమోలు అడ్డుపెట్టుకుని వందల కోట్లు దోపిడీ చేస్తున్నారని కోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళారు.
రేట్లు పెంచి వసూలు చేసే పుష్ప 2 కలెక్షన్లు ఎస్ క్రో అకౌంట్ లో జమ చేయాలి అని ఈ సందర్భంగా కోర్ట్ ను కోరారు. రేట్లు పెంపు, వసూళ్లకు రెగ్యులేటర్ మేకానిజం ఇప్పటి వరకు లేదని… అలాగే… బెనిఫిట్ షోల పేరుతో అడ్డగోలు టైమింగ్ లో సినిమాలను ప్రదర్శిస్తున్నారని కోర్ట్ ముందు ఉంచారు. అర్థ రాత్రి షో లు నిబంధనలకు పూర్తి విరుద్ధం అని ఈ సందర్భంగా తన పిటీషన్ లో ప్రస్తావించారు. ఇక ఇదే సమయంలో ఏపీ హైకోర్టులో కూడా పుష్ప 2 సినిమాపై పిటీషన్ దాఖలు అయింది. ఈ న్యూస్ పుష్ప మేకర్స్ ను మరింత కంగారు పెడుతోంది.
పుష్ప -2 సినిమా విడుదలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. పిటిషన్ విచారించింది ఏపీ హై కోర్టు… అదనపు షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం లాంటి అంశాలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు అయింది. పుష్ప సినిమాలో 100 కోట్లు వినియోగించినట్లు ఆధారాలు సమర్పించలేదని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్ట్ ముందు తన వాదన వినిపించారు. ప్రతివాదులుగా పుష్ప నిర్మాతలు, హీరో అల్లూ అర్జున్, హీరోయిన్స్ శ్రీలీల, రష్మికను చేర్చారు. దీనిపై స్పందించిన కోర్ట్ తగు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. ఇవన్నీ జనసేన నేతలే కావాలని చేస్తున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.