పుష్ప షూట్ అవ్వలా… ఇంకేం బ్యాలెన్స్ సుక్కూ…?

ఓ వైపు పుష్ప ది రూల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ పీక్స్ లో ఉంది. ట్రైలర్ తర్వాత ఆడియన్స్ కూడా సినిమాపై హోప్స్ పెంచుకున్నారు. ప్రీ బుకింగ్ కోసం ఆడియన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత నార్త్ లో కూడా సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది అనే విషయం క్లారిటీ వచ్చింది జనాలకు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2024 | 08:54 PMLast Updated on: Nov 20, 2024 | 8:54 PM

Pushpa 2 Movie Shoot Still Pending

ఓ వైపు పుష్ప ది రూల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ పీక్స్ లో ఉంది. ట్రైలర్ తర్వాత ఆడియన్స్ కూడా సినిమాపై హోప్స్ పెంచుకున్నారు. ప్రీ బుకింగ్ కోసం ఆడియన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత నార్త్ లో కూడా సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది అనే విషయం క్లారిటీ వచ్చింది జనాలకు. సినిమాపై పాట్నా ఈవెంట్ కు ముందు అంచనాలు… పాట్నా ఈవెంట్ తర్వాత అంచనాలు వేరు. సినిమా రిలీజ్ డేట్ కోసం ఆడియన్స్ రోజులు లెక్క బెడుతున్నారు. ట్రైలర్ కూడా పీక్స్ లో ఉండటంతో సినిమాపై నమ్మకం పెరిగింది.

త్వరలోనే ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఆరు ఈవెంట్స్ ఓవరాల్ గా బ్యాలెన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఓ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసారు మేకర్స్. చెన్నైలో కూడా త్వరలోనే ఈవెంట్ ను నిర్వహిస్తారు. ఇలా ఫ్యాన్స్ అందరూ ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఓ న్యూస్ తలనొప్పిగా మారింది. సినిమా షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనే న్యూస్ తో ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. దాదాపు మూడేళ్ల నుంచి పార్ట్ 2 షూట్ జరుగుతూనే ఉంది. కంప్లీట్ అయిపోయిందని రీసెంట్ గా న్యూస్ వచ్చింది.

అయినా సరే ఇంకో యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయాల్సి ఉంది అంటున్నారు మేకర్స్. మొన్నటి వరకు ఓ ఐటెం సాంగ్ షూట్ చేయాల్సి ఉంది, హీరోయిన్ ఫైనల్ కాలేదు అనే న్యూస్ షేక్ చేసింది. చివరికి శ్రీలీలతో ఐటెం సింగ్ ను షూట్ చేసారు. ట్రైలర్ లో కూడా ఆ విషయం క్లారిటీ వచ్చింది. అందుకోసం ఆమెకు రెండు కోట్లు కూడా మేకర్స్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇంకో సాంగ్ షూట్ చేయాల్సి ఉంది అంటున్నారు. ఓ రెండు రోజుల షూట్ బ్యాలెన్స్ ఉందని, త్వరలోనే ఇది ఫినిష్ చేస్తారని టాక్.

గతంలో షూట్ చేసిన ఓ సీన్ సరిగా రాలేదని అందుకే మళ్ళీ షూట్ చేయడానికి రెడీ అవుతున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పుడు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. డైరెక్టర్ సుకుమార్ పైనే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా షూట్ ఏంటీ అంటూ తిట్టడం స్టార్ట్ చేసారు. మరి షూట్ ఎప్పుడు ఫినిష్ చేస్తారో చూడాలి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఏడు ఈవెంట్స్ ను ప్లాన్ చేసారు. సినిమా రిలీజ్ కూడా ఇంకా 15 రోజులు మాత్రమె ఉంది. నార్త్ లో సినిమాపై బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయింది.