ఏపీలో పుష్ప టికెట్ రేట్స్ ఇవే, బూతులు మింగుతున్న ఫ్యాన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో పుష్ప 2 టికెట్ ధరలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు ఆడియన్స్. సినిమా పెట్టుబడి వసూలు చేసుకోవడానికి ఈ రేంజ్ లో అభిమానుల దగ్గరి నుంచి వసూలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ... అసలు సినిమా టికెట్ 1200 ఏంటీ అంటూ స్వయంగా ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో పుష్ప 2 టికెట్ ధరలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు ఆడియన్స్. సినిమా పెట్టుబడి వసూలు చేసుకోవడానికి ఈ రేంజ్ లో అభిమానుల దగ్గరి నుంచి వసూలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ… అసలు సినిమా టికెట్ 1200 ఏంటీ అంటూ స్వయంగా ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. సినిమా పిచ్చిన అమ్ముకోవాలని చూడటం ఏంటీ అని, ఫ్యామిలీ సినిమా చూడాలంటే ఎంత ఖర్చు చేయాలి అంటూ నానా బూతులు తిడుతున్నారు. ముందు తెలంగాణాలో పెరిగిన టికెట్ రేట్స్ ఇప్పుడు ఏపీలో కూడా పెరిగాయి.
పుష్ప 2: రూల్ టిక్కెట్‌లు సరికొత్త రికార్డును క్రియేట్ చేసాయి ఏపీలో. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా టికెట్ రేట్స్ ఈ రేంజ్ లో లేవు. అడ్వాన్స్ ప్రివ్యూ షోలు డిసెంబర్ 4న అంటే బుధవారం సాయంత్రం నుంచి… ఎంపిక చేసిన థియేటర్లలో రాత్రి 9:30 గంటలకు మొదలుకానున్నాయి. సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్ లలో టిక్కెట్‌ల ధర రూ. 944 (GSTతో సహా) ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్ప 2 కోసం సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్ లలో రోజుకు ఆరు షోలను అనుమతించింది. టిక్కెట్ ధరలు రూ.324.50, రూ.413గా నిర్ణయించారు.
డిసెంబర్ 6 నుండి 17 వరకు ఐదు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో ఇప్పటికే టికెట్ రేట్స్ పై విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం పుష్ప 2 టిక్కెట్ ధరలను పెంచడంపై సామాన్య ప్రజలు కూడా మండిపడుతున్నారు. పెయిడ్ ప్రివ్యూలకు రూ. 1,200, మల్టీప్లెక్స్ లకు రూ.531, సింగిల్ స్క్రీన్‌లకు రూ.354గా నిర్ణయించారు. ఈ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ 3న సినిమా ప్రీమియర్ షోకి ఒక్కరోజు ముందు విచారణ జరిపి… తాము ఏం చేయలేమని స్పష్టం చేసింది.
అయినా సరే ప్రీ బుకింగ్ మార్కెట్ మాత్రం పీక్స్ లో ఉంది. పుష్ప 2: ది రూల్ అడ్వాన్స్ బుకింగ్‌లతో దుమ్ము రేపింది. బుక్‌మైషోలో రూ. 50 కోట్ల మార్కును దాటింది. అలాగే 1 మిలియన్ టిక్కెట్‌లను విక్రయించింది. తాజా ట్రేడ్ రిపోర్ట్ ల ప్రకారం కల్కి 2898 AD, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, KGF: చాప్టర్ 2 వంటి బ్లాక్‌బస్టర్‌లు సెట్ చేసిన రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేసింది. ఈ చిత్రాన్ని మొదట తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీలలో 2D, IMAX 2D, 3D ఫార్మాట్లలో రిలీజ్ చేస్తారు. హిందీ వెర్షన్‌లో ముందు డిసెంబర్ 4 న అర్ధరాత్రి షోలు ఉంటాయని… వార్తలు వచ్చినా లేవని క్లారిటీ ఇచ్చారు. ఈ టికెట్ ధరలపై ఇప్పుడు ఫ్యాన్స్ బూతులు మింగేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.