పుష్ప గాడి రూల్ కు నెట్ ఫ్లిక్స్ ఫిదా.. దీనెమ్మ క్రేజ్.. వేరే లెవెల్
ఇండియన్ సినిమా హిస్టరీలో పుష్ప సీక్వెల్ ఒక సెన్సేషన్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సినిమా రిలీజ్ అయ్యే వరకు షేక్ అయింది సోషల్ మీడియా.
ఇండియన్ సినిమా హిస్టరీలో పుష్ప సీక్వెల్ ఒక సెన్సేషన్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సినిమా రిలీజ్ అయ్యే వరకు షేక్ అయింది సోషల్ మీడియా. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ సినిమా ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ తర్వాత అయితే కేసులతో కూడా ఈ సినిమా నేషనల్ నేషనల్ వైడ్ గా కూడా ఫేమస్ అయ్యింది. అల్లు అర్జున్ ను ఒకరోజు జైల్లో పెట్టడానికి ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కూడా కారణం. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
ఇప్పటివరకు థియేటర్లలో సందడి చేసిన పుష్ప ఇప్పుడు ఓటిటీ ఫ్లాట్ ఫాం ను రూల్ చేయడానికి రెడీ అయిపోయాడు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయగా దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ ఇండియాలో అయితే భారీగా వసూలు చేసింది. బాలీవుడ్ సినిమాలకు మించి అక్కడ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకు నార్త్ ఇండియాలో దాదాపుగా 1000 కోట్ల రూపాయల వసూలు వచ్చాయి. అయితే సినిమా ఫైనల్ గా వసూళ్లు ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు.
32 రోజులకు 1831 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసిందని అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత నుంచి అనౌన్స్మెంట్లు రాలేదు. ఐటి దాడులు భయంతోనే అనౌన్స్ చేయలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమా రీలోడెడ్ వర్షన్ ను జనవరి 17న రిలీజ్ చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నెట్ఫ్లిక్స్ లో ఎక్స్టెండ్ వెర్షన్ తో రిలీజ్ చేశారు. దీనికి నెట్లిక్స్ కూడా దాసోహం అయిపోయింది. పుష్ప ది రూల్ రన్ టైం థియేటర్లలో ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు మూడు గంటల 17 నిమిషాలు. రీలోడేడ్ వెర్షన్ లో మరో 10 నిమిషాలు ఆడ్ చేశారు.
తర్వాత మరికొంత యాడ్ చేసారు. నెట్ ఫ్లిక్స్ లో మరో 20 నిమిషాలు యాడ్ చేశారు. దీంతో మొత్తం మూడు గంటల 47 నిమిషాలు మూవీని నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో రిలీజ్ చేశారు. ఇక నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఎకౌంటు ఇన్స్టాగ్రాం లో బయో చేంజ్ చేసింది. దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ రాసుకోచ్చింది. ఇక రిలీజ్ అయిన వెంటనే వ్యూస్ కూడా భారీగా ఉన్నాయట. ఇక పుష్పాను ఆన్లైన్లో ప్రమోట్ చేయడానికి ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో పుష్పరాజ్ ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ ఉంటాడు. అంత పెద్ద లోడ్ ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే పుష్పరాజు తన స్టైల్ లో నెట్ ఫ్లిక్స్ పేరు చూపిస్తాడు. అనంతరం నెట్ఫ్లిక్స్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనే డైలాగ్ తో పాటుగా నెట్ ఫ్లిక్స్ జింగిల్ టుడుమ్ అని బన్నీ చెప్పడం హైలైట్ గా చెప్పొచ్చు. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ పై మాత్రం ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు.