PUSHPA 2: క్రేజీ ఛాన్స్.. కేశవ క్యారెక్టర్‌లో మహేష్ విట్టా..

సినిమాలో కీలక పాత్ర పోషించిన కేశవ రోల్ కోసం ఇప్పుడు మరొకరిని తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప పార్ట్ 1లో కేశవ క్యారెక్టర్ సినిమాలో కీ రోల్ పోషించింది. బన్నీకి తోడుగా ఉండటంతో పాటు ఒక తమ్ముడిగా, ఫ్రెండ్‌గా కనిపించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 02:21 PMLast Updated on: Jan 31, 2024 | 2:21 PM

Pushpa 2 Shooting In Progress Mahesh Vitta Replaced Jagadeesh Prathap Bandari

PUSHPA 2: పుష్పగాడు టైం ఫిక్స్ చేసి మరీ రూలింగ్ చేయడానికి వచ్చేస్తున్నాడు. పార్ట్ 1తో సునామీ సృష్టించిన బన్నీ పార్ట్ 2తో అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటిలో యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నాడట. చాలా గ్యాప్ తర్వాత అలా షూటింగ్ మొదలు పెట్టారో లేదో అప్పుడే ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా జరుగుతున్న కొత్త షెడ్యూల్‌లో భారీ ఛేజింగ్ సీన్లను ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. రష్మిక, ఫహద్ ఫాజిల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

Guntur kaaram: గెట్ రెడీ.. గుంటూరు కారం నుంచి మరో సర్‌ప్రైజ్!

అదే విధంగా ఈ షెడ్యూల్‌లో సునీల్‌తో పాటు కీలక నటీనటులు అంతా పాల్గొంటున్నారట. ఇప్పటి వరకు కీలక భాగం షూటింగ్ కంప్లీట్ కావడంతో బన్నీ సినిమా స్పీడ్‌ను మరింత పెంచాలనుకుంటున్నాడట. అయితే సినిమాలో కీలక పాత్ర పోషించిన కేశవ రోల్ కోసం ఇప్పుడు మరొకరిని తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప పార్ట్ 1లో కేశవ క్యారెక్టర్ సినిమాలో కీ రోల్ పోషించింది. బన్నీకి తోడుగా ఉండటంతో పాటు ఒక తమ్ముడిగా, ఫ్రెండ్‌గా కనిపించాడు. అయితే ఈ క్యారెక్టర్‌లో నటించిన జగదీశ్‌ అరెస్ట్ కావడంతో షూటింగ్‌కు ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించకపోవడంతో షూటింగ్‌కు మరింత ఆలస్యం అవుతుందని భావించిన సుకుమార్.. ఆ క్యారెక్టర్ కోసం మహేష్ విట్టాను తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

అయితే గతంలో కేశవ క్యారెక్టర్ తనకు వచ్చిందని.. కానీ అప్పట్లో చేయలేకపోయానని మహేష్ విట్టా ఓఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు పార్ట్2లో నటించే అవకాశం వచ్చినట్లు ఓ న్యూస్ వినిపిస్తోంది. మరీ ఇందులో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే.