Pushpa 2 The Rule : పుష్ప 2 వాయిదా… నిరాశలో ఫ్యాన్స్…
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న చిత్రాలలో 'పుష్ప 2 ది రూల్' (Pushpa 2 The Rule) ఒకటి. అప్పట్లో 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' (KGF 2) సినిమాల కోసం పాన్ ఇండియా వైడ్ గా ఎంతలా ఎదురుచూశారో.. ఇప్పుడు 'పుష్ప-2'

'Pushpa 2 The Rule' is one of the highly anticipated films across the country.
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న చిత్రాలలో ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) ఒకటి. అప్పట్లో ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ (KGF 2) సినిమాల కోసం పాన్ ఇండియా వైడ్ గా ఎంతలా ఎదురుచూశారో.. ఇప్పుడు ‘పుష్ప-2’ (Pushpa2) కోసం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడిందందే వార్త సంచలనంగా మారింది.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ‘పుష్ప 2’. 2021 డిసెంబర్ లో విడుదలై, పాన్ ఇండియా వైడ్ గా సంచలన సృష్టించిన ‘పుష్ప: ది రైజ్’కి కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడువులైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో..అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 15 ఎప్పుడొస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి భారీ షాక్ తగిలేలా ఉంది. ‘పుష్ప 2’ ఆగస్టు 15 వ తేదీకి రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి.
విడుదల తేదీకి ఇంకా రెండు నెలలే సమయముంది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అందుకే ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుపుతున్నారు. ఒకేసారి మూడు యూనిట్స్ వర్క్ చేస్తున్నాయని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు యూనిట్లు, మారేడుమిల్లిలో ఒక యూనిట్ పని చేస్తున్నాయని సమాచారం. అయినప్పటికీ షూటింగ్ జులై చివరికి పూర్తయ్యేలా ఉందట. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయంలో పట్టేలా ఉందట. అయితే పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్న సినిమా కావడంతో.. రిలీజ్ డేట్ ని దృష్టిలో పెట్టుకొని, ఇలా పరుగులుపెట్టి సినిమా పూర్తి చేయడం కరెక్ట్ కాదని సుకుమార్ అండ్ టీం భావిస్తున్నారట. కాస్త లేట్ అయినా ఆడియన్స్ అంచనాలకు మించిన అవుట్ పుట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అందుకే రిలీజ్ డేట్ టార్గెట్ ని పక్కన పెట్టి, కూల్ గా వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారట. అదే జరిగితే ఆగస్టు 15 కి ‘పుష్ప-2’ వస్తుందనే దానిపై బన్నీ ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందే.