PUSHPA 2: పుష్ప.. జపాన్ వెళ్లేది అందుకోసమే.. ఇదే క్లారిటీ..
బాహుబలి తర్వాత బాహుబలి 2 తీసిన జక్కన్న.. బాహుబలి 3ని మాత్రం పబ్లిసిటీ స్టంట్‌గా వాడాడు. త్రిబుల్ ఆర్ 2 మీద అలాంటి ఆశలే కలిగించాడు. కానీ, పుష్ప 3 మాత్రం అలాకాదని సుకుమార్ టీం గట్టిగానే ఫీలర్స్ వదులుతోంది.
PUSHPA 2: బెర్లిన్‌లో సందడిచేసిన బన్నీ అక్కడ పుష్ప 3 గురించి చెప్పిన మాటలు, మెల్లిగా ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీశాయి. బాహుబలి తర్వాత బాహుబలి 2 తీసిన జక్కన్న.. బాహుబలి 3ని మాత్రం పబ్లిసిటీ స్టంట్‌గా వాడాడు. త్రిబుల్ ఆర్ 2 మీద అలాంటి ఆశలే కలిగించాడు.
MEGASTAR CHIRANJEEVI: మెగా రచ్చ.. మరోసారి మెగాస్టార్.. ఊర్వశీ చిందులు
కానీ, పుష్ప 3 మాత్రం అలాకాదని సుకుమార్ టీం గట్టిగానే ఫీలర్స్ వదులుతోంది. ఇప్పుడు బన్నీ కూడా పుష్ప 3 కోసం కొన్ని ఐడియాస్ ఉన్నాయన్నాడు. బ్యాక్‌డ్రాప్ జపాన్‌ని పెట్టుకుని, ఈ సినిమా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనంతటికీ కారణం త్రిబుల్ ఆర్, బాహుబలినే. ఈరెండు సినిమాలు రజినీకాంత్ మూవీలకంటే కూడా భారీగా జపాన్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చాయి. ఇండియన్ సినిమాలకు క్రేజ్‌ని పెంచాయి. అందుకే అక్కడ జెండా ఎగరేయాలనే జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో పుష్ప 3 ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
అలాగని ఇది వెంటనే తెరకెక్కే అవకాశం లేదు. త్రివిక్రమ్, ఆట్లి సినిమాల తర్వాతే 2027లో పుష్ప 3 పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈలోపు రంగస్థలం కాంబినేషన్ రిపీట్ కానుంది. చిరుతో మూవీ అనుకున్న సుకుమార్ ఫైనల్‌గా రామ్ చరణ్‌తో సినిమా తీయబోతున్నాడట. అది కూడా బుచ్చి బాబు మూవీ సగం షూటింగ్ పూర్తయ్యాకే మొదలవుతుందట.