పుష్ప2 కి కౌంటర్ ఓటీటీలో… ఎన్టీఆర్ ఫ్యాన్స్ అక్కడ సంబురాలు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర వచ్చి నెలలు గడుస్తోంది. కాని ఇంకా కొత్త సినిమాలతో ఒకవిషయంలో పోటీ పడుతూనే ఉంది. విచిత్రం ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 థియేటర్స్ లో 1000 కోట్ల వసూళ్లు రాబట్టాడని నిర్మాతలు ఎనౌన్స్ చేస్తే, అదే టైంలో దేవర తాలూకు ఓటీటీ రికార్డు ఎనౌన్స్ అయ్యింది..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర వచ్చి నెలలు గడుస్తోంది. కాని ఇంకా కొత్త సినిమాలతో ఒకవిషయంలో పోటీ పడుతూనే ఉంది. విచిత్రం ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 థియేటర్స్ లో 1000 కోట్ల వసూళ్లు రాబట్టాడని నిర్మాతలు ఎనౌన్స్ చేస్తే, అదే టైంలో దేవర తాలూకు ఓటీటీ రికార్డు ఎనౌన్స్ అయ్యింది.. నిజానికి మెగా బ్యాచ్ కి అల్లు ఆర్మీకి పడట్లేదు. కాబట్టే అస్సలు మెగా హీరోలే కాదు, పుష్ప 2 మీద ఇండస్ట్రీలో మరే హీరోలు కూడా రెస్పాండ్ కావట్లేదు… విచిత్రమైన సైలెన్స్ వినిపిస్తోంది. మెగా హీరోలకి కోపమొస్తుందనే, ఇలా మిగతా హీరోలు కూడా పుష్ప2 మీద రియాక్ట్ కావట్లేదంటున్నారు. దీనికి కారణం పుష్ప2 వసూళ్ల మీద కూడా కొన్ని డౌట్లు ఉండటమే… ఏదేమైనా పుష్ఫ 2 వసూల్ల రికార్డులని మైత్రీ మూవీ మేకర్స్ రోజుకో పోస్టర్ తో ఎనౌన్స్ చేస్తుంటే, వారానికోసారి దేవర న్యూస్ సీన్ లోకి వస్తోంది. థియేటర్స్ లో పుష్ప 2 జోరంటూ అల్లు ఆర్మీ సంబరాలు చేసుకుంటుంటే, ఓటీటీలో నెంబర్ వన్ దేవర అని తేలటంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ సంబరాలు మొదలయ్యాయి…అదేంటో చూసేయండి.
పుష్ప 2 వెయ్యికోట్ల క్లబ్ లో కేవలం 6 రోజుల్లో చేరిందంటే అంతా ఊగిపోతున్నారు. కాని నిర్మాతలు ఇంతగా రోజుకో పోస్టర్ తో పుష్ప 2 వసూల్లని ఎనౌన్స్ చేసిన మెగా హీరోల నుంచి సౌండ్ లేదు. మిగతా స్టార్స్ నుంచి అప్రిషియేషన్ లేదు. కారణం మెగా గ్యాప్ వల్ల మెగా హీరోలు, మెగా హీరోలకు నచ్చదేమో అని మిగతా హీరోలు ఈ విషయంలో రియాక్ట్ కావట్లేదనంటున్నారు
ఇలాంటి గుసగుసలెలా ఉన్నా, అల్లు ఆర్మీకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చేందుకు ఓటీటీ రికార్డులు దొరికాయి… ప్రపంచ వ్యాప్తంగా 3 వారాలుగా టాప్ 8 లో ఉన్న దేవర మూవీ, లాస్ట్ వీక్ ఇండియా మొత్తంగా టాప్ 3 లో కొచ్చింది.. ఈ వారం బిగినింగ్ లో వస్తున్న వ్యూవ్స్ పరంగా చూస్తే, ఇండియానెంబర్ 1గా దేవర ఓటీటీని ఏలుతున్నట్టు తెలుస్తోంది
ఈ మూవీ వచ్చినప్పుడు ఎంత నెగెటీవ్ ప్రచారం జరిగిందో, అంతకుమించి ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చాక వ్యతిరేకత కూడా భారీ గా పెరిగింది. ఐనా 2 వారాల్లో 8 మిలియన్ అవర్స్ వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకున్న దేవర, ఇప్పుడు ఏకంగా ఇండియా నెం.1 గా ఓటీటీని ఏలుతోందని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వ్యూవర్ షిప్స్ చూస్తే, వరల్డ్ వైడ్ టాప్ 3 లో నిలిచింది దేవర
ఆల్రెడీ జవాన్, పటాన్, కల్కీ తోపాటు తమిళ మూవీలైన వెట్టయాయ్, భారతీయుడు2, గోట్ తాలూకు ఓటీటీ రికార్డులని దేవర బ్రేక్ చేసింది. సలార్ ని కూడా వాచ్ అవర్స్ పరంగా దాటేసింది. దీంతో ఓవర్ సీస్, థియేటర్స్ లో పుష్ప 2 దూసుకెళ్లుతున్న సంగతి ఎంత నిజమో కాని, ఓటీటీలో మాత్రం పుష్ప2 కి భారీ ఛాలెంజ్ ని రెడీ చేస్తోంది దేవర మూవీ.
గత రెండు వారాలుగా యాక్షన్ మూవీలకు, వెబ్ సీరీస్ లకే ఓటీటీలో భారీ స్పందన పెరిగింది. ఇలాంటి టైంలో దేవరకి ఉన్న ఫళంగా రెండు వారాలుగా వ్యూవర్ షిప్ భారీగా పెరగటం విచిత్రమే.. ఒకవైపు పుష్ప 2 వసూళ్ లఎనౌన్స్ మెంట్, దీనికి ప్యార్ లల్ గా దేవర ఓటీటీ తాలూకు రికార్డుల అప్ డేట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ని యాక్టివ్ గా ఉంచేలా చేస్తున్నాయి.