7 సిస్టర్స్ లో పుష్ప డామినేషన్, లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
వరల్డ్ వైడ్ గా పుష్ప డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో గంట గంటకు ప్రూవ్ అవుతోంది. 12 వేల స్క్రీన్స్ లో పుష్ప 2 ను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం ఏమో గాని ఇప్పుడు అసలు బాలీవుడ్ సినిమాలకు దిక్కులేని చోట కూడా పుష్ప గాడి డామినేషన్ వేరే లెవెల్ లో ఉంది.
వరల్డ్ వైడ్ గా పుష్ప డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో గంట గంటకు ప్రూవ్ అవుతోంది. 12 వేల స్క్రీన్స్ లో పుష్ప 2 ను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం ఏమో గాని ఇప్పుడు అసలు బాలీవుడ్ సినిమాలకు దిక్కులేని చోట కూడా పుష్ప గాడి డామినేషన్ వేరే లెవెల్ లో ఉంది. కన్యాకుమారి నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు పుష్ప రూల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 1 మిలియన్ టికెట్స్ ను పుష్ప 2 కోసం బుక్ చేసారు. ఇవన్నీ ప్రీ బుకింగ్స్. ప్రీ బుకింగ్స్ తోనే 50 కోట్ల గ్రాస్ రీచ్ అయింది పుష్ప 2.
తెలుగు, హిందీ, మలయాళ మార్కెట్ లో 36 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప 2. హిందీ వెర్షన్ లో నాలుగు లక్షల టికెట్ లు బుక్ అయ్యాయి. రిలీజ్ కు ఇంకా రెండు రోజుల టైం ఉంది. మన తెలుగులోనే దాదాపు 6 లక్షల టికెట్ లు ప్రీ బుకింగ్ అయ్యాయని లెక్కలు చెప్తున్నాయి. ప్రాంతీయంగా, తెలంగాణ అత్యధికంగా 54% ఆక్యుపెన్సీని నమోదు చేసింది, 1,400 షోలకు పైగా లైనులో ₹ 9.8 కోట్లు వసూలు చేసింది. పశ్చిమ బెంగాల్ ₹ 1.21 కోట్లతో 21% ఆక్యుపెన్సీ రేటు రికార్డ్ అయిందని జాతీయ మీడియా లెక్కలు చెప్తున్నాయి.
తమిళనాడు, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కూడా పుష్ప 2 ప్రీ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. కేరళ, 8% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, ₹ 1.4 కోట్లు వసూలు చేసింది, తక్కువ షోస్ ఉన్న ప్రాంతాల్లో కూడా పుష్ప డామినేషన్ కంటిన్యూ అవుతోంది. ఇక్కడ తెలుగును హిందీ డామినేట్ చేయడం చూసి జనాలు షాక్ అవుతున్నారు. తెలుగు 2D వెర్షన్ షోస్ 2,867 కాగా… హిందీ 2D వెర్షన్ అత్యధిక షోస్ తో డామినేట్ చేస్తోంది. 9,303 షోస్ పడుతున్నాయి హిందీలో. అంటే నార్త్ లో పుష్ప హవా ఏ రేంజ్ లో ఉందో ఈ లెక్కలే చెప్తున్నాయి.
మెట్రోపాలిటన్ నగరాలతో పాటు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా అండమాన్, నికోబార్ దీవులతో సహా… చిన్న చిన్న రాష్ట్రాలలో ప్రీ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. విడుదలకు ఇంకో రెండు రోజులు ఉండగానే సినిమా టాక్ ఎలా ఉంటుందో తెలియకుండానే ఈ రేంజ్ లో బుకింగ్స్ అంటే సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ లెక్క ఊహకు కూడా అందదు అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు.