Pushpa2 : 200 రోజుల్లో పుష్పగాడి రూలింగ్!

గత కొన్ని రోజులుగా పుష్ప 2 (Pushpa2) మూవీ వాయిదా పడుతోంది.. డిసెంబర్‌కు షిప్ట్ అవుతోంది.. అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ నుంచి ఆగష్టుకి పోస్ట్‌ పోన్ అవనుందనే వార్తలు రావడమే. కానీ ఇప్పటి వరకు దేవర వాయిదా గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. దేవర వెనక్కి తగ్గిన పుష్పరాజ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 04:11 PMLast Updated on: Jan 30, 2024 | 4:11 PM

Pushpa Gadi Ruling In 200 Days

గత కొన్ని రోజులుగా పుష్ప 2 (Pushpa2) మూవీ వాయిదా పడుతోంది.. డిసెంబర్‌కు షిప్ట్ అవుతోంది.. అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ నుంచి ఆగష్టుకి పోస్ట్‌ పోన్ అవనుందనే వార్తలు రావడమే. కానీ ఇప్పటి వరకు దేవర వాయిదా గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. దేవర వెనక్కి తగ్గిన పుష్పరాజ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు.

ఇప్పటికే ఓ సారి రిలీజ్ డేట్‌ పై క్లారిటి ఇచ్చిన మేకర్స్.. ఇప్పుడు మరోసారి సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ.. పుష్ప 2 ది రూల్ సరిగ్గా మరో 200 రోజుల్లో, అంటే ఆగస్ట్ 15న థియేటర్లోకి రాబోతున్నట్టుగా సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో పుష్ప2 రిలీజ్ డేట్ పై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని మరోసారి చెప్పేశారు మేకర్స్. కాబట్టి.. 200 రోజుల్లో పుష్పగాడి రూలింగ్ మొదలు కానుందని చెప్పాలి.

ఖచ్చింతగా భారీ ఓపెనింగ్స్‌తో పాటు లాంగ్ రన్‌లో వెయ్యి కోట్లు టార్గెట్‌గా రాబోతోంది పుష్ప2. పార్ట్ 1కి మించి భారీ బడ్జెట్‌తో పార్ట్ 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అదిరిపోయే అవుట్ పుట్ కోసం అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1తో బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకొని 69 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు అల్లు అర్జున్ (Allu Arjun). అందుకే.. పుష్ప2 కోసం మరింత కష్ట పడుతున్నాడు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్స్ పీక్స్‌లో ఉంటాయని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Shri Prasad) సంగీతాన్ని అందిస్తున్నారు.