Pushpa2 : పుష్పగాడు మోత మోగిస్తున్నాడు

ప్రస్తుతం పుష్ప.. పుష్ప సాంగ్ (Pushpa Song) సరికొత్త డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేసే పనిలో ఉంది. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఈ సాంగ్‌.. ఇండియాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌ నమోదు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 6, 2024 | 11:15 AMLast Updated on: May 06, 2024 | 11:15 AM

Pushpa Gadu Is Singing

 

 

ప్రస్తుతం పుష్ప.. పుష్ప సాంగ్ (Pushpa Song) సరికొత్త డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేసే పనిలో ఉంది. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఈ సాంగ్‌.. ఇండియాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌ నమోదు చేసింది. అంతేకాదు.. సోషల్ మీడియాను మోత మోగిస్తున్నాడు పుష్పగాడు.

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్‌ (Allu Arjun) కు జాతీయ ఉత్తమ నటుడు (National Best Actor) అవార్డు తెచ్చిపెట్టి.. టాలీవుడ్ చరిత్రను తిరగ రాసింది పుష్ప పార్ట్ 1 సినిమా. అందుకే.. సెకండ్ పార్ట్‌ను అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వస్తున్న ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సాంగ్‌గా నిలిచింది పుష్ప.. పుష్ప సాంగ్. అలాగే..ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. పుష్ప పుష్ప లిరికల్‌ సాంగ్‌ని మొత్తం 6 భాషల్లో రిలీజ్ చేయగా.. ఇండియాలోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే 100కె+ రీల్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన పుష్పగాడి స్టెప్పులే కనిపిస్తున్నాయి.ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. మరి ఈసారి పుష్పగాడు ఏం చేస్తాడో చూడాలి.