దేవరతో పుష్ప ఇంటర్వ్యూ, ఫ్యాన్స్ కు మండుతుంది ఇక్కడ
దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ ఒంటరి అయ్యాడు. ఎస్ యంగ్ టైగర్ ను టాలీవుడ్ ఒంటరిని చేసింది. సినిమా బాగున్నా బాగాలేదని మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేసారు. సినిమా డిజాస్టర్ అంటూ దేవర రేంజ్ తగ్గించే ప్రయత్నం గట్టిగా చేసారు.
దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ ఒంటరి అయ్యాడు. ఎస్ యంగ్ టైగర్ ను టాలీవుడ్ ఒంటరిని చేసింది. సినిమా బాగున్నా బాగాలేదని మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేసారు. సినిమా డిజాస్టర్ అంటూ దేవర రేంజ్ తగ్గించే ప్రయత్నం గట్టిగా చేసారు. అసలు సినిమాలో విషయం లేదని రాజమౌళి సెంటిమెంట్ ను ఎవడూ బ్రేక్ చేయలేరు అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కాని దేవర సైలెంట్ గా తన పని తాను చేసాడు. ఎవడు ఎలా టార్గెట్ చేసినా తొక్కుకుంటూ బాలీవుడ్ పై కూడా దండయాత్ర చేసాడు.
సౌత్ లో ఇప్పుడు ఎన్టీఆర్ కు తిరుగులేదు. సోలో ప్రాజెక్ట్ లు చేసినా సినిమాల్లో స్టార్ లు ఎవరూ లేకపోయినా సినిమాను ఎలా బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తూ నిలబెట్టాలో దేవరకు బాగా క్లారిటీ ఉంది. అందుకే ఎన్టీఆర్ పై పెట్టుబడి పెట్టడానికి అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు నిర్మాతలు. బాలీవుడ్ కూడా ఎన్టీఆర్ పై చాలా నమ్మకంగా ఉంది. అందుకే వార్ 2 సెట్స్ లోనే ఆదిత్య చోప్రా… ఎన్టీఆర్ కు కొత్త సినిమా స్టోరీ స్టార్ డైరెక్టర్ తో చెప్పించి ఒప్పించాడు. త్వరలోనే కరణ్ జోహార్ కూడా ఒక స్టోరీ చెప్పించే ఛాన్స్ ఉంది.
ఇప్పుడు ఎన్టీఆర్ ను ఎదుర్కోవడం టాలీవుడ్ హీరోలకు కూడా పెద్ద పరీక్షే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో స్నేహం కోసం మాత్రం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. దేవర కష్టాల్లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ ను తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకోవాలని చూస్తున్నాడు. ఏకంగా ఎన్టీఆర్ తో మూడు భాషల్లో ప్రమోషన్ చేయించే ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కు కన్నడ, తమిళ మార్కెట్ పై పట్టు పెరిగింది. ఆ భాష కూడా ఎన్టీఆర్ చాలా బాగా మాట్లాడతాడు. అందుకే ప్రమోషన్స్ విషయంలో దేవరను వాడుకునే ప్లాన్ చేస్తున్నాడు.
కాని ఇది దేవర ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. సినిమాను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటే… ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితే తప్పు ఏంటీ అని నిలదీస్తున్నారు. ఎన్టీఆర్ తో ఇప్పుడు ఇంటర్వ్యూ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. నువ్వు ఒంటరిగా హిట్ కొట్టావ్… నువ్వు నువ్వుగానే ఉంటే మంచిది అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎన్టీఆర్ తో బన్నీకి మంచి స్నేహం ఉన్నా సరే సపోర్ట్ చేయలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.